కంప్యూటర్లో ఆరున్నర కిలోల బంగారం స్మగ్లింగ్ చేస్తూ దొరికిపోయిన భారతీయుడు

- August 18, 2016 , by Maagulf
కంప్యూటర్లో ఆరున్నర కిలోల బంగారం స్మగ్లింగ్ చేస్తూ  దొరికిపోయిన భారతీయుడు

మనామా : బహ్రెయిన్ కు  బంగారం స్మగ్లింగ్ చేయబోతూ,  దొరికిపోయిన భారతీయుని  వద్ద నుంచి  6 కిలోల 400 గ్రాముల బంగారం కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకొన్నారు. కంప్యూటర్ " యు పి ఎస్ " లో దాచి ఉంచిన బంగారం అక్రమంగా దేశం నుంచి  దాటవేయడానికి  ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఆ వ్యక్తిని  అరెస్టు చేశారు .

స్మగ్లింగ్ చేసిన వ్యక్తి  దక్షిణ భారతదేశంలోని కేరళ రాష్ట్రం లోని  కొజ్ కోడీ కి  చెందిన తస్లీమ్ గా గుర్తించారు.    కాలికట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో బుధవారం  రెడ్ హ్యాండెడ్ గా  పట్టుబడ్డాడు.కంప్యూటర్ యొక్క   " యు పి ఎస్ "  లో  బంగారు బిస్కెట్ లని రహస్యంగా  దాచినట్లు తనిఖీ అధికారులచే  కనుగొనబడింది. విమానాశ్రయం అధికారులకు అందుకున్న ఒక  సమాచారం తరువాత తస్లీమ్ కోసం వేచి ఉంది అరెస్ట్ చేశారు. విచారణ అనంతరం  మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com