ఎవరికి వారే గొప్ప

- July 28, 2015 , by Maagulf
ఎవరికి వారే గొప్ప

ఒక ఊళ్లో ఒక మామిడి చెట్టు ఉండేది. దానికి ఒక సంవత్సరం గుత్తులు గుత్తులుగా కాయలు కాశాయి. దాంతో అనేక రకాల పక్షులు ఆ చెట్టు మీద ఆవాసం ఏర్పర్చుకున్నాయి. వాటిలో ఒక కోకిల, పాలపిట్ట, నెమలి కూడా ఉన్నాయి. ఒకరోజు కోకిల, పాలపిట్ట దగ్గరకు వచ్చి, నాతో స్నేహం చేస్తావా? అని ఆడిగింది. దానికి పాలపిట్ట నువ్వు నల్లగా అందవికారంగా ఉన్నావు. నేనెంతో అందంగా ఉన్నాను. నేను నీతో స్నేహం చేయడమేంటి పో అంది. అందుకు కోకిల నేను నల్లగా ఉన్నా కానీ నా గొంతు ఎంతో తియ్యగా ఉంటుంది. నా గొంతు విని ప్రజలు వసంత కాలం వచ్చిందని భావిస్తారు, కవులు కూడా నా గొంతు గొప్పతనాన్ని అనేక రకాలుగా వర్ణిస్తూ ఉంటారు కాబట్టి నీ కన్నా నేనే గొప్ప అంది. ఇంతలో అక్కడికి ఒక నెమలి వచ్చింది. నెమలిని పాలపిట్ట మా ఇద్దరిలో ఎవరు గొప్ప అని అడిగింది. అందుకు నెమలి నేను పురి విప్పి నాట్యం చేశానంటే నా అందం ముందు ఎవరైనా తలదించుకోవాల్సిందే అంది. అందుకు పాలపిట్ట సిగ్గుపడుతూ నిజమే కదా. నేను తప్పుగా ఆలోచించాను. అందుకే ఆ దేవుడు ఒక్కొక్కరికీ ఒక్కో అందం ఇచ్చి అందర్నీ సమదృష్టితో చూశాడు. ఎవరి గొప్ప వారికుంది. అయినా మనందరం పక్షులం. ఈ రకమైన బేధభావం లేకుండా మనమంతా ఐకమత్యంతో ఉండాలి అంది. దాంతో ముగ్గురికీ కనువిప్పు కలిగి అప్పటి నుండీ ఆ మూడు స్నేహంగా ఉండసాగాయి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com