సింధుకు హైదరాబాద్‌లో అడుగడుగునా నీరాజనాలు...
- August 22, 2016
ఒలింపిక్స్‌లో రజతం సాధించిన తెలుగుతేజం పీవీ సింధుకు హైదరాబాద్‌లో అడుగడుగునా నీరాజనాలు. అసమాన ప్రతిభతో పతకం తెచ్చిపెట్టిన ఫస్ట్ భారతీయ యువతిగా చరిత్ర సృష్టించింది ఆమె. సొంతరాష్ర్టం ఆమెకు ఘనంగా స్వాగతం పలికింది. సింధు, కోచ్ గోపీచంద్‌లను తెలంగాణ మంత్రి కేటీఆర్‌తోపాటు ఏపీ మంత్రులు, అధికారులు, ఫ్యామిలీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో పుష్పగుచ్చాలిచ్చి సింధును సాదరంగా ఆహ్వానించారు. అక్కడనుంచి ఓపెన్ టాప్ వాహనంపై విజయోత్సవ ర్యాలీ సాగింది.శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి రాజేంద్రనగర్, అత్తాపూర్, మెహిదీపట్నం, టోలిచౌకి మీదుగా గచ్చిబౌలి స్టేడియం వరకు ఈ ర్యాలీని సాగింది. అనంతరం అక్కడి స్టేడియం అంతా తిరిగారు.అక్కడ ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రి కేటీఆర్.. సిందు, కోచ్ గోపిచంద్‌లను సన్మానించనున్నారు. మరోవైపు పతకం సాధించిన తర్వాత సింధు తొలిసారి నగరానికి రానున్న నేపథ్యంలో రోడ్డుకు ఇరువైపులా పెద్ద సంఖ్యలో హోర్డింగ్‌లు వెలిశాయి.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







