'స్వచ్ఛ భారత్'పై షార్ట్‌ఫిలిం పోటీ ఎంట్రీలకు చివరి తేదీ సెప్టెంబర్ 10
- August 22, 2016
ప్రధాని నరేంద్రమోదీ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ భారత కార్యక్రమాన్ని ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం షార్ట్‌ఫిలిం పోటీలను నిర్వహించనుంది. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి రెండేళ్లు పూర్తికావస్తున్న సందర్భంగా.. పరిశుభ్రత గురించి, తద్వారా ప్రజల ఆరోగ్యంపై దాని ప్రభావాన్ని తెలియజెప్పే కథలతో పోటీలను నిర్వహించాలని నిర్ణయించింది. ప్రజలంతా పరిశుభ్రతను పాటించేలా వారిలో మార్పు తేవాలంటే స్వచ్ఛ భారత గురించి అవగాహన కల్పించడం ముఖ్యమని కేంద్ర ప్రచార, సమాచార మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.షార్ట్‌ఫిలిం పోటీల్లో పాల్గొనదలచిన వారు తమ ఎంట్రీలను జాతీయ చలనచిత్ర అభివృద్ధి సంస్థ (ఎన్‌ఎ్‌ఫడీసీ)కు సెప్టెంబర్ 10వ తేదీలోగా పంపించాల్సిందిగా సూచించింది. అన్ని వయసుల వారు ఈ పోటీల్లో పాల్గొనవచ్చని పేర్కొంది. ఈ పోటీలో విజేతలను గాంధీ జయంతి రోజైన అక్టోబర్ 2న ప్రకటించనున్నట్లు, ప్రథమ విజేతకు సర్టిఫికెట్‌తోపాటు రూ.10 లక్షల నగదు బహుమతి ఇవ్వనున్నట్లు తెలిపింది. ఇక ద్వితీయ బహుమతిని ముగ్గురికి ఇవ్వనున్నట్లు, ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున అందజేయనున్నట్లు, తృతీయ బహుమతిగా ఆరుగురికి రూ.2 లక్షల చొప్పున ఇవ్వనున్నట్లు వివరించింది.
ఆసక్తి కలిగినవారు ఇతర వివరాలకు ఠీఠీఠీ.ుఽజఛీఛిజీుఽఛీజ్చీ.ఛిౌఝ వెబ్‌సైట్‌ను సంప్రదించాలని పేర్కొంది.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్‌కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్‌పీరియన్స్‌తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







