దుబాయ్ ట్రామ్‌వేపై కొత్త యూ టర్న్స్
- August 23, 2016
రెండు కొత్త లెఫ్ట్ టర్న్స్, అలాగే రెండు యూ టర్న్స్ దుబాయ్ రటామ్ రూట్‌లో త్వరలో ప్రారంభం కానున్నాయని రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (ఆర్‌టిఎ) వెల్లడించింది. జుమైరా బీచ్ రెసిడెన్స్ 1 మరియు జుమైరా బీచ్ రెసిడెన్స్ 2 స్టేషన్ల మధ్య అల్ సుఫౌ అల్ గార్బి స్ట్రీట్స్ ఇంటర్‌సెక్షన్ వద్ద ప్రారంభమయ్యే టర్న్స్ వాహనదారులకు మరింత ఉపయోగకరంగా ఉండనున్నాయి. రోడ్ సేఫ్టీలో భాగంగా నవంబర్ 2014న దుబాయ్ ట్రామ్ ప్రారంభం సందర్భంగా అన్ని యూ టర్న్స్, అలాగే లెఫ్ట్ టర్న్స్‌ని మూసివేశారు. ట్రామ్ అలాగే, వాహనాల మధ్య ఎలాంటి ప్రమాదాలకు తావు లేకుండా తగిన చర్యలు తీసుకున్నట్లు ఆర్‌టిఎ - ట్రాఫిక్ అండ్ రోడ్స్ ఏజెన్సీ సిఇఓ మైతా మొహమ్మద్ బిన్ అదాయ్ చెప్పారు. ఓ కమిటీని ఏర్పాటు చేసి, పూర్తిస్థాయి అధ్యయనం తర్వాతే కొత్త యూ టర్న్స్, కొత్త లెఫ్ట్ టర్న్స్‌పై నిర్నయం తీసుకున్నామని ఆమె వివరించారు. సేఫ్ సిగ్నలింగ్ వ్యవస్థలో భాగంగా ట్రాఫిక్ లైట్స్‌ని పూర్తిగా పరీక్షించామని ఆర్‌టిఎ వర్గాలు తెలిపాయి. ప్రత్యేకంగా సర్వైలెన్స్ కెమెరాలను ఏర్పాటు చేసి సిగ్నల్స్‌ని జంప్ చేసేవారిని గుర్తిస్తున్నారు.
తాజా వార్తలు
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!
- యూఏఈ లాటరీలో భారతీయుడికి Dh5 మిలియన్ల జాక్పాట్..!!
- క్యాబిన్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటుకు జీఎంఆర్ ఏరో టెక్నిక్ ఒప్పందం
- మహారాష్ట్ర హైరైజ్ బిల్డింగ్లో అగ్నిప్రమాదం..ఇద్దరు మహిళలు సజీవదహనం
- ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత







