కువైట్ విమానాశ్రయంలో ట్రాన్సిట్ కార్యకలాపాలు నిలిపివేత యధాతథం..!!
- October 04, 2026
కువైట్ : కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ట్రాన్సిట్ కార్యకలాపాలు తిరిగి ప్రారంభమయ్యాయంటూ వస్తున్న వార్తలను జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ఖండించింది. ట్రాన్సిట్ కార్యకలాపాలపై ప్రస్తుతం అమల్లో ఉన్న నిలిపివేత నిర్ణయం తదుపరి ప్రకటన వెలువడే వరకు కొనసాగుతుందని స్పష్టం చేసింది.
ట్రాన్సిట్ కార్యకలాపాలను తిరిగి ప్రారంభించడం లేదా పునరుద్ధరించడంపై ఏ విమానయాన సంస్థతోనూ తమ సంస్థ చర్చలు జరపలేదని DGCA అధికార ప్రతినిధి అబ్దుల్లా అల్-రజ్హీ తెలిపారు.మిడిలీస్టులో ప్రాంతంలో దాడులు ప్రారంభమైనప్పటి నుంచి అమల్లో ఉన్న నిర్ణయాలు, ఆదేశాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.
ప్రస్తుత ప్రాంతీయ పరిణామాలు, భద్రతా పరిస్థితుల నేపథ్యంలో ప్రయాణికులు, విమానాలు, విమానాశ్రయాల భద్రతకు అత్యున్నత ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో ముందస్తు జాగ్రత్త చర్యగా ట్రాన్సిట్ కార్యకలాపాలను నిలిపివేసినట్లు అల్-రజ్హీ వివరించారు.ట్రాన్సిట్ కార్యకలాపాల పునఃప్రారంభంపై అధికారిక ప్రకటన వచ్చే వరకు ప్రయాణికులు, విమానయాన సంస్థలు ప్రస్తుత నిబంధనలనే అనుసరించాలని DGCA స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- ఖతార్ లో కస్టమర్ సర్వీస్ వీక్ 2026ను నిర్వహిస్తున్న PHCC..!!
- సౌదీ అరేబియాలో పండ్లు, కూరగాయల దిగుమతికి కొత్త నిబంధనలు..!!
- ఒమన్‌లో పర్యాటక కార్యకలాపాల లైసెన్సింగ్‌కు కీలక నిబంధనలు..!!
- యూఏఈ లాటరీ.. ఓ విజేతకు Dh5 మిలియన్ భారీ బహుమతి..!!
- హవల్లీ అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం..!!
- బిగ్ టికెట్ అబుదాబి.. అజ్మాన్ ఫిలిప్పీన్స్ ప్రవాసికి Dh20 మిలియన్ జాక్‌పాట్..!!
- బహ్రెయిన్ విమానాశ్రయం వెనుక మాంగ్రూవ్ బెల్ట్..!!
- కువైట్ విమానాశ్రయంలో ట్రాన్సిట్ కార్యకలాపాలు నిలిపివేత యధాతథం..!!
- సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు కేరళ నర్సులు సహా ఐదుగురు మృతి
- కాక్‌పిట్ పై దాడి.. ‘చివరి పోరాటం’తో వందల ప్రాణాలు కాపాడిన ఫ్లై దుబాయ్ పైలట్







