సెప్టెంబర్‌ 1 నుంచి కొత్త కరెన్సీ నోట్లు

- August 24, 2016 , by Maagulf
సెప్టెంబర్‌ 1 నుంచి కొత్త కరెన్సీ నోట్లు

కొత్త కరెన్సీ నోట్లు సెప్టెంబర్‌ 1 నుంచి అందుబాటులోకి వస్తాయి. 10, 20 బహ్రెయినీ దినార్స్‌ 'నోటు' రూపంలో అందుబాటులోకి వస్తాయి. ఈ కొత్త నోట్లను డూప్లికేట్‌ చేయడం దాదాపు అసాధ్యమని అధికారిక వర్గాలు అంటున్నాయి. మరింత భద్రత కలిగిన ఫీచర్లతో వీటిని రూపొందించారు. కొత్త నోట్లపై బ్యాంకులకు ఇప్పటికే సమాచారం అందించారు. సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ బహ్రెయిన్‌ ఈ మేరకు ప్రకటనను విడుదల చేసింది. అయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న నోట్ల చెలామణీకి ఎలాంటి ఇబ్బందులు ఉండవని సిబిబి స్పష్టం చేసింది. బహ్రెయినీ కరెన్సీ నోట్లలో మార్పు చివరిసారిగా 2008లో జరిగింది. 2008 మార్చ్‌ 17న కొత్త డిజైన్లు, సెక్యూరిటీ ఫీచర్లతో అన్ని డినామినేషన్లకు సంబంధించిన కొత్త నోట్లను విడుదల చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com