పీవీ సింధుకు ఎన్‌ఏసీ జ్యూయలర్స్ అరుదైన బహుమతి..

- August 24, 2016 , by Maagulf
పీవీ సింధుకు ఎన్‌ఏసీ జ్యూయలర్స్ అరుదైన బహుమతి..

ఒలింపిక్స్‌లో పతకం సాధించి, మువ్వనెల్ల పతాకాన్ని ఎగురవేసి చరిత్ర సృష్టించిన బ్యాడ్మింటన్ స్టార్, తెలుగు తేజం పీవీ సింధుకు ఎన్‌ఏసీ జ్యూయలర్స్ అరుదైన బహుమతిని ప్రకటించింది. దాదాపు 6లక్షల ఖరీదైన నెక్లెస్‌ను సింధుకు అందించనున్నట్లు యాజమాన్యం తెలిపింది. సింధుతో పాటు ఒలింపిక్స్‌లో ఇతర పతకాలు సాధించిన క్రీడాకారులకు కూడా బహుమతులను ప్రకటించింది. కాంస్య పతకాన్ని సాధించిన సాక్షి మాలిక్‌కు 3లక్షల విలువ చేసే రవ్వల నెక్లెస్‌ను ప్రదానం చేస్తున్నట్లు సదరు షోరూం ప్రకటించింది. జిమ్నాస్టిక్స్‌లో అద్భుత ప్రదర్శన ఇచ్చి, మెడల్‌ను తృటిని కోల్పోయిన దీపా కర్మాకర్‌కు లక్ష రూపాయలు విలువ చేసే బహుమతిని అందించనున్నట్లు ఎన్‌ఏసీ జ్యూయలర్స్ యాజమాన్యం తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com