దుబాయ్ లో 10 మిలియన్ రూపాయల చాక్లెట్ల లోడుతో తప్పిపోయిన భారతీయ డ్రైవర్
- August 25, 2016
పది మిలియన్ రూపాయల ( 547,200 డి హెచ్ ) విలువైన చాక్లెట్లు పూర్తి ట్రక్ తో ఒక భారతీయుడు యుఎఇ లో గల్లంతైనట్లు కేసు నమోదు చేయబడింది.సాజిద్ పటేల్ అనే 40 ఏళ్ల ముంబై నివాసి, గత ఆరు సంవత్సరాల నుంచి దుబాయ్ లో నివసిస్తున్నాడు. ఇటీవల మార్స్ చాక్లెట్ బార్ల పూర్తి ట్రక్ తో సహా తప్పిపోయినట్లు ఒక నివేదిక ప్రకారం తెలియ చేయబడింది.అవలోన్ జనరల్ ల్యాండ్ ట్రాన్స్పోర్ట్, రోడ్డు రవాణా సంస్థ తెలిపిన వివరాల ప్రకారం సాజిద్ తమ సంస్థలో గత రెండు సంవత్సరాల నుంచి ఉద్యోగం చేస్తున్నాడని పేర్కొంది. మేము అతని కొరకు చేసిన అన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయి మరియు దుబాయ్ పోలీసులు అతను ప్రయాణించిన ట్రక్ జాడ కోసం చుట్టుపక్కల గాలించారు.వాస్తవంగా జరిగిందేమిటి ?ఈ నెల ఆగస్టు 4 వ తేదీన సాజిద్ 85,000 డాలర్ల విలువైన చాక్లెట్లు నింపిన ఒక కంటైనర్ ను తీసుకొని సౌదీ అరేబియా లోని బురైదః కు బట్వాడా చేసేందుకు కేటాయించబడటం జరిగింది. . రాబిన్సన్ రోడ్రిగ్స్, అవలోన్ జనరల్ మేనేజర్ తెలిపిన సమాచారం ప్రకారం, "మేము ఆగష్టు 12 వ తేదీ వరకు సాజిద్ పటేల్ తో సంభాషిస్తూనే ఉన్నామని గ్లోబల్ పొజీషనింగ్ సిస్టంలో తాను ఉన్న స్థానాన్ని రియాద్ లో చూపించినట్లు ఆయన తన నివేదికలో పేర్కొన్నారు. కేవలం 450 కిలోమీటర్ల దూరంలో ఉన్న బురైదః ప్రాంతంలో ఆగస్టు 13 వ తేదీన సాజిద్ పటేల్ సరుకుని అందచేయాల్సిఉంది. అయితే సంస్థ సాజిద్ తో సంబంధాలను కోల్పోయింది.మొదటి తన వాహనంలో ఉన్న గ్లోబల్ పొజీషనింగ్ సిస్టం పనిచేయలేదు, ఆ తర్వాత, 5 మిలియన్ రూపాయల విలువ గల ట్రక్కు కూడా అదృశ్యమయ్యంది. "
సాజిద్ పటేల్ మాయామయ్యే ముందు గల్ఫ్ అంతటా 50 ట్రిప్పులు వేశాడు.సాజిద్ పటేల్ ఆచూకీ గూర్చి అతని స్నేహితులను అడిగినా అతని జాడ సాధ్యం కాలేదు.అతని జాడను కనుగొనేందుకు హెచ్ ఆర్ శాఖ సాజిద్ పటేల్ తమకు ఇచ్చిన పత్రాలను పరిశోధిస్తే , ముంబై లోని జోగేశ్వరిలో పశ్చిమాన క్రిస్టల్ అపార్టుమెంట్లు నుండి భారతదేశం తన చిరునామా గుర్తించవచ్చు.అయితే, ఈ విధంగా దారితీసేన పరిస్థితులలో సాజిద్ పటేల్ ఒకవేళ చనిపోయి ఈ వెతుకలాటకు ముగింపుగా మారిందేమోనన్న కొందరు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే అతను ఇంతవరకు ఎవరితో సంబంధాలు కల్గిలేకపోవడంతో అనేక అనుమానాలకు తావు ఇస్తున్నట్లవుతుంది. మేము బురాయిదా గిడ్డంగి తో సంబంధం నిరంతరం కల్గి ఉన్నామని తమ డ్రైవర్ సాజిద్ పటేల్ ఇప్పటివరకు సరుకు తో అక్కడకు చేరుకోలేదు . మేము మా ఉద్యోగికి ఏమీ జరగకూడదని సౌదీ అరేబియాలో తప్పిపోకుండా ఉండాలని కోరుకుంటున్నామని సంస్థ ఉన్నతాధికారి పేర్కొన్నారు.ఈ కేసు గురించి దుబాయ్ పోలీస్ తెలియజేసామని కంపెనీ అధికారిక ప్రకటనలో చెప్పారు. మేము తప్పిపోయిన డ్రైవర్ గూర్చి దుబాయ్ పోలీసు తెలిపాము అతనిని వెతకడానికి చట్టపరమైన ప్రక్రియ ప్రారంభమయింది, సానుకూల సమాధానం కోసం మేము భారత దౌత్యకార్యాలయంకు ఈ విషయంపై సంప్రదించామని అవలోన్ నుండి ఒక ప్రతినిధి తెలిపారు.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







