సౌదీ పోలీసులు ఆత్మాహుతి సభ్యుడిని మట్టుపెట్టడంతో 70 జీవితాలు రక్షించబడ్డాయి

- August 26, 2016 , by Maagulf
సౌదీ పోలీసులు ఆత్మాహుతి సభ్యుడిని మట్టుపెట్టడంతో 70 జీవితాలు రక్షించబడ్డాయి

మనామా:  తూర్పు సౌదీ అరేబియాలో క్వాటిప్ ప్రాంతంలో  అల్ ముస్తఫా మసీదులోనికి చొరబడి  ఆరాధకుల మధ్యకు వెళ్లి తనను తాను ఆత్మాహుతితో  పేల్చుకొనేందుకు సిద్ధపడిన ఒక వ్యక్తిని  సౌదీ పోలీసులు చాకచక్యంగా మట్టుపెట్టడంతో  70 మంది మాఘ్రేబ్లో (సూర్యాస్తమయ) ప్రార్ధనలు చేస్తున్నవారి ప్రాణాలు రక్షించబడ్డాయి.  ప్రార్థనలు మధ్యలో భక్తులు మసీదు సమీపంలో తుపాకీ శబ్దాలు విన్నామని  కానీ మేము ప్రార్థనలు కొనసాగించినట్లు  అనీ," ఆలీ అల్ ఆది, షియా మసీదు బాధ్యతలు చూసుకొనే వ్యక్తి  చెప్పారు. ఇది తమపై దాడి ప్రయత్నంలో జరిగిందని  గ్రహించలేకపోయామని  ప్రార్థనలు తరువాత.  ప్రజలు మసీదు నుంచి  బయటకు వచ్చినప్పుడు, భారీ భద్రత ఉనికి ఉండటంతో ఆ  ప్రాంతం సురక్షితం కాబడిందని  గురువారం " మా గల్ఫ్ డాట్ కామ్ " కు  తెలిపారు. మసీదు చుట్టూ భద్రత ఉన్నప్పటికి ఇద్దరు అపరిచితులు వారిని సమీపించి  మరియు మసీదు గురించిన ప్రశ్నలడిగేనాట్లు అల్ ఆది నివేదించారు. ఆ తర్వాత అక్కడ భద్రతను  కట్టుదిట్టం చేసినట్లు తెలిపారు.రెండు వారాల క్రితం, ఉదయం 3 గంటల సమయంలో ఒక వ్యక్తి పలువురిని సంప్రదించి  మసీదు గురించి పలు వివరాలు అడిగేడని భక్తులు తెలిపారు. ఈ విషయాన్ని తాము  సెక్యూరిటీ అధికారులు కలుసుకొని ఇద్దరు అపరిచితులు భక్తులని  అడిగిన అనుమానాలు  సమాచారం గురించి తెలిపినట్లు చెప్పారు.తాము ఇచ్చిన సమాచారం అధికారుల నుంచి  ప్రశంసలను పొందేమని  అల్ ఆది  తెలిపారు. .వారు మసీదు నుంచి 100 మీటర్ల దూరంలో కారు ఉంచి దాడికి పాల్పడదామని యోచించినప్పటకీ  పోలీసులు జరిపిన కాల్పులలో మృతి చెందినట్లు చెప్పారు.ఒక నివాస ప్రాంతం లో ఉన్న ఈ మసీదు, 500 భక్తులు వరకు హాజరయ్యే అవకాశం ఉందని అల్ ఆది తెలిపారు.మసీదు సమీపంలో భద్రతా సిబ్బంది  అతని  అనుమానాస్పద కదలికల గమనించి  అదుపులోనికి తీసుకొని అతన్నీ  ప్రశ్నించడం జరిగింది.ఆ వ్యక్తి బాంబర్ గా కనుగొన్నారు జరిగింది అనితన వీపు మీద ఒక స్పోర్ట్స్ బ్యాగ్ మోస్తున్నాడు. పోలీసుల కళ్లబడటంతోనే ఆ వ్యక్తి తనను తాను పేల్చుకోవడానికి  ప్రయత్నించాడని, మంత్రి బుధవారం మధ్యాహ్నం చెప్పారు.అతని చర్యని గమనించిన పోలీసులు నేరుగా ఆ వ్యక్తిపై కాల్పులు జరిపి తన కదలికని కట్టడి చేశారు. దీనితో ఆ ఆత్మాహుతి సభ్యుని ప్రణాళిక కార్యరూపం దాల్చలేదు. ఆ బాంబర్ ను ఆసుపత్రికి తీసుకువెళ్లే  ప్రయత్నంలో మార్గ మధ్యలోనే మరణించాడని సౌదీ అంతర్గత వ్యవహారాల శాఖ ప్రతినిధి తెలిపిన వివరాల ప్రకారం  అతని వద్ద ఉన్న బ్యాగ్ లో నాలుగు కిలోగ్రాముల పేలుడు పదార్ధాలు ఉన్నట్లు కనుగొనబడింది.  పోలీసులు ఆ వ్యక్తి  శరీరం యొక్క తనిఖీ శోధన సమయంలో పాకిస్తానీ ప్రవాసీయుని గుర్తించే జాతీయ గుర్తింపు కార్డును కనుగొనబడిందని పోలీసులు తెలిపారు.

 

 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com