సహచరుడిని కత్తితో పొడిచి చంపి ఆపై శవాన్ని దగ్ధం చేసిన భారతీయుడు
- August 26, 2016
రియాడ్: అల్-ఫైసాలియాహ్ జిల్లాలో భారతీయ కార్మికుడు తన సహచరుడిని కత్తితో పొడిచి చంపి ఆ తర్వాత ఆ నేరాన్ని కప్పిపుచ్చడానికి చేసే ప్రయత్నంలో భాగంగా మృతదేహం ఆచూకీ లేకుండా చేయడానికి నిప్పంటించి తగలబెట్టినట్లు హత్యానేరం ఒప్పుకున్నాడు.జిల్లాలో ఒక తివాచీలు తయారుచేసే గిడ్డంగిలో అగ్నిప్రమాదం జరగడంపై స్పందించిందిన పౌర రక్షణ అగ్నిమాపక యూనిట్లు ప్రమాద స్థలంకు వెళ్ళినపుడు ఈ హత్యానేరం కనుగొనబడినట్లు రియాద్ పోలీసులు తెలిపారు.అగ్ని మాపక సిబ్బంది తమ విధుల్లో నిమగ్నమై ఉండగా ఒక ప్రాంతంలో వారు దాదాపు బూడిద కావొస్తున్న మానవ మృత శరీరం కనుగొన్నారు; ఈ మృతదేహాన్ని ఫోరెన్సిక్ పరిశోధకులు స్వాధీనం చేసుకొని పరీక్షలు ప్రారంభించారు.గిడ్డంగిలో దారుణంగా హత్య చేయబడిన 40 ఏళ్ళ భారతీయుని కత్తితో పొడిచి హతమార్చిన అనంతరం అతని శరీరంకు నిప్పంటిచారు. ఆధారాలను బట్టి బాధితుడు డబ్బు వివాదం మీద భారతీయ సహ ఉద్యోగితో తగువు ఏర్పడిందని వీరి మధ్య వివాదానికి అదే ప్రధాన సమస్య అని మాకు తెలిసిందని పోలీసు ప్రతినిధి చెప్పారు. అప్పు తీసుకోవడం కారణంగా , హతుడు తన పాస్పోర్ట్ స్వాధీనం చేసుకొని వేధిస్తున్న నేపథ్యంలో విధిలేని పరిస్థుతులలో తన సహచరుడిని హత్య చేయాల్సి వచ్చిందని హంతకుడు ఒప్పుకున్నాడు. అదేవిధంగా అగ్నిప్రమాదం సృష్టించడానికి ముందు గిడ్డంగిలో 3,000 ఎస్ ఆర్ దొంగిలించినట్లు అంగీకరించాడు.ఈ హత్యకు సంబంధించిన ఆయుధం కత్తిని పోలీసులు సేకరించారు. నేరస్తుడుని పోలీసు విచారణ కోసం అదుపులో తీసుకొన్నారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







