సౌదీ పోలీసులు ఆత్మాహుతి సభ్యుడిని మట్టుపెట్టడంతో 70 జీవితాలు రక్షించబడ్డాయి
- August 26, 2016
మనామా: తూర్పు సౌదీ అరేబియాలో క్వాటిప్ ప్రాంతంలో అల్ ముస్తఫా మసీదులోనికి చొరబడి ఆరాధకుల మధ్యకు వెళ్లి తనను తాను ఆత్మాహుతితో పేల్చుకొనేందుకు సిద్ధపడిన ఒక వ్యక్తిని సౌదీ పోలీసులు చాకచక్యంగా మట్టుపెట్టడంతో 70 మంది మాఘ్రేబ్లో (సూర్యాస్తమయ) ప్రార్ధనలు చేస్తున్నవారి ప్రాణాలు రక్షించబడ్డాయి. ప్రార్థనలు మధ్యలో భక్తులు మసీదు సమీపంలో తుపాకీ శబ్దాలు విన్నామని కానీ మేము ప్రార్థనలు కొనసాగించినట్లు అనీ," ఆలీ అల్ ఆది, షియా మసీదు బాధ్యతలు చూసుకొనే వ్యక్తి చెప్పారు. ఇది తమపై దాడి ప్రయత్నంలో జరిగిందని గ్రహించలేకపోయామని ప్రార్థనలు తరువాత. ప్రజలు మసీదు నుంచి బయటకు వచ్చినప్పుడు, భారీ భద్రత ఉనికి ఉండటంతో ఆ ప్రాంతం సురక్షితం కాబడిందని గురువారం " మా గల్ఫ్ డాట్ కామ్ " కు తెలిపారు. మసీదు చుట్టూ భద్రత ఉన్నప్పటికి ఇద్దరు అపరిచితులు వారిని సమీపించి మరియు మసీదు గురించిన ప్రశ్నలడిగేనాట్లు అల్ ఆది నివేదించారు. ఆ తర్వాత అక్కడ భద్రతను కట్టుదిట్టం చేసినట్లు తెలిపారు.రెండు వారాల క్రితం, ఉదయం 3 గంటల సమయంలో ఒక వ్యక్తి పలువురిని సంప్రదించి మసీదు గురించి పలు వివరాలు అడిగేడని భక్తులు తెలిపారు. ఈ విషయాన్ని తాము సెక్యూరిటీ అధికారులు కలుసుకొని ఇద్దరు అపరిచితులు భక్తులని అడిగిన అనుమానాలు సమాచారం గురించి తెలిపినట్లు చెప్పారు.తాము ఇచ్చిన సమాచారం అధికారుల నుంచి ప్రశంసలను పొందేమని అల్ ఆది తెలిపారు. .వారు మసీదు నుంచి 100 మీటర్ల దూరంలో కారు ఉంచి దాడికి పాల్పడదామని యోచించినప్పటకీ పోలీసులు జరిపిన కాల్పులలో మృతి చెందినట్లు చెప్పారు.ఒక నివాస ప్రాంతం లో ఉన్న ఈ మసీదు, 500 భక్తులు వరకు హాజరయ్యే అవకాశం ఉందని అల్ ఆది తెలిపారు.మసీదు సమీపంలో భద్రతా సిబ్బంది అతని అనుమానాస్పద కదలికల గమనించి అదుపులోనికి తీసుకొని అతన్నీ ప్రశ్నించడం జరిగింది.ఆ వ్యక్తి బాంబర్ గా కనుగొన్నారు జరిగింది అనితన వీపు మీద ఒక స్పోర్ట్స్ బ్యాగ్ మోస్తున్నాడు. పోలీసుల కళ్లబడటంతోనే ఆ వ్యక్తి తనను తాను పేల్చుకోవడానికి ప్రయత్నించాడని, మంత్రి బుధవారం మధ్యాహ్నం చెప్పారు.అతని చర్యని గమనించిన పోలీసులు నేరుగా ఆ వ్యక్తిపై కాల్పులు జరిపి తన కదలికని కట్టడి చేశారు. దీనితో ఆ ఆత్మాహుతి సభ్యుని ప్రణాళిక కార్యరూపం దాల్చలేదు. ఆ బాంబర్ ను ఆసుపత్రికి తీసుకువెళ్లే ప్రయత్నంలో మార్గ మధ్యలోనే మరణించాడని సౌదీ అంతర్గత వ్యవహారాల శాఖ ప్రతినిధి తెలిపిన వివరాల ప్రకారం అతని వద్ద ఉన్న బ్యాగ్ లో నాలుగు కిలోగ్రాముల పేలుడు పదార్ధాలు ఉన్నట్లు కనుగొనబడింది. పోలీసులు ఆ వ్యక్తి శరీరం యొక్క తనిఖీ శోధన సమయంలో పాకిస్తానీ ప్రవాసీయుని గుర్తించే జాతీయ గుర్తింపు కార్డును కనుగొనబడిందని పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







