ఎయిర్‌టెల్‌ 5కే రన్‌...

- August 27, 2016 , by Maagulf
ఎయిర్‌టెల్‌ 5కే రన్‌...

ఎయిర్‌టెల్‌ హైదరాబాద్‌ మారథాన్‌లో నగరవాసులు ఉత్సాహంగా పాల్గొన్నారు. మాదాపూర్‌ హైటెక్‌సిటీ ఎగ్జిబిషన్‌ సెంటర్‌లో ఎయిర్‌టెల్‌ 5కే రన్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర ఐటీశాఖ కార్యదర్శి జయేష్‌ రంజన్‌ పాల్గొని ప్రారంభించారు. నగరంలోని పలు ఐటీ సంస్థలకు చెందిన ఉద్యోగులు, హైదరాబాద్‌ రన్నర్లు దాదాపు 5000 మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జయేష్‌రంజన్‌ మాట్లాడుతూ.. ఆరోగ్యం పట్ల నగరవాసులు ఉత్సాహం కనబరుస్తున్నారని, దేశంలో ఎక్కడా లేని విధంగా నగరంలో మారథాన్‌ నిర్వహిస్తున్నారని తెలిపారు. .

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com