'ఒక్కడొచ్చాడు' సినిమాలో గాన ప్రతిభ చూపించిన శ్రుతిహాసన్‌..

- August 27, 2016 , by Maagulf
'ఒక్కడొచ్చాడు' సినిమాలో గాన ప్రతిభ చూపించిన  శ్రుతిహాసన్‌..

శ్రు తిహాసన్‌ బహుముఖ ప్రజ్ఞాశాలి అనే సంగతి తెలిసిందే. ఆమెకు సంగీతమంటే ప్రాణం. పాటలు చక్కగా పాడుతుంది. తన సినిమాల్లో తన గాన ప్రతిభ చూపించింది. తెలుగులో తొలిసారి మరో కథానాయిక కోసం పాడుతోంది. విశాల్‌, తమన్నా జంటగా తెరకెక్కుతున్న చిత్రం 'ఒక్కడొచ్చాడు'.

సురాజ్‌ దర్శకుడు. ఈ చిత్రంలోని 'హృదయం హృదయం...' గీతాన్ని శ్రుతిహాసన్‌ పాడనుంది. హిప్‌ హాప్‌ తమిళ స్వరపరిచిన ఈ గీతాన్ని భాగ్యలక్ష్మి రచించారు. ఆగస్టు 29న విశాల్‌ పుట్టిన రోజు సందర్భంగా సినిమా టీజర్‌ని విడుదల చేయనున్నారు.

అక్టోబరు 9న పాటల్ని, దీపావళికి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు నిర్మాత హరి తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com