తెలు'గోడు'కు ఇన్నాళ్లకు ఊరట..
- August 27, 2016
వీసాలు, పాస్‌పోర్టుల నుంచి పౌర ధ్రువీకరణ పత్రాలు, పని భద్రత దాకా.. అడుగడుగునా అన్యాయానికి గురవుతున్న విదేశీ పేదలకు ఉచిత న్యాయ సహాయం అందించాలని దుబాయ్ ప్రభుత్వం నిర్ణయించింది. పరాయి దేశ చట్టాల మీద అవగాహన లేక తెలుగు రాషా్ట్రల నుంచి వెళ్లిన వారిలో ఎక్కువమంది కేసుల్లో ఇరుక్కొని, కారాగారాలపాలవుతున్న ఉదంతాలు వింటున్నాం. ఈ పరిస్థితి ఒక్క తెలుగువారికో, భారతీయులకో మాత్రమే పరిమితం కాదు. పొట్ట చేతపట్టుకొని పరాయి గడ్డపై బతుకుతున్న ప్రతి విదేశీయుడూ ఎదుర్కొంటున్న సమస్యే ఇది.ముఖ్యంగా, వీరి ఆర్థిక స్తోమత అంతంతమాత్రం కావడం, న్యాయం ముసుగులో మోసగాళ్లు చెలరేగిపోతుండటంతో కేసుల నుంచి త్వరగా బయటపడలేకపోతున్నారు. ఈ స్థితిలో వారికి దేశ న్యాయ వ్యవస్థని చేరువ చేసేందుకు దుబాయ్ సిద్ధమవుతోంది. ఆర్థిక స్తోమ త, నేరచరిత్ర లేకపోవడం ప్రధాన అర్హతగా ఓ జాబితాను తయా రుచేసి.. వారికి మాత్రమే న్యాయ సేవలందిస్తారు.దీనికోసం సీడీఏ అధ్వర్యంలో లీగల్ క్లినిక్ టీమ్‌ని ప్రభుత్వం ఏర్పాటు చేసిం ది. బాధితులు 8003232 టోల్ ఫ్రీ నంబర్ legalclinic @cda.gov.aeలో సంప్రదించి సాయం పొందొచ్చు. అయితే, ఎమిరేట్ వీసా కల్గిన విదేశీయులకే ఈ సేవలు పరిమితం.
తాజా వార్తలు
- ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు
- నోబెల్ విజేతలకు రూ.11.52 కోట్లు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!
- అరేబియా గల్ఫ్‌లో 22 మంది సిబ్బందిని రక్షించిన యూఏఈ..!!
- పాస్‌పోర్ట్, రెసిడెన్సీ సేవల్లో సహకారానికి ఖతార్–యూఏఈ చర్చలు..!!
- సౌదీలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం..!!
- సముద్ర భద్రతకు ప్రాధాన్యం.. లాటిన్ అమెరికాతో గల్ఫ్ దేశాల కొత్త బంధం..!!







