ఇరాక్‌లో ఆత్మాహుతి దాడి : 18 మంది మృతి

- August 29, 2016 , by Maagulf
ఇరాక్‌లో ఆత్మాహుతి దాడి : 18 మంది మృతి

ఇరాక్‌లోని ఒయాసిస్‌ నగరం ఆత్మాహుతి దాడులతో దద్దరిల్లింది. ఈ దాడుల్లో 18 మంది మరణించారు. సాయుధులైన ఐదుగురు ఉగ్రవాదులు సూయిసైడ్‌ బెల్ట్స్‌, రైఫిల్స్‌, గ్రనైడ్లతో దాడికి దిగినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. ఐదుగురిలో ఒకరు ఆత్మాహుతి దాడి చేసుకోగా, మిగతా వారిని భద్రతాసిబ్బంది కాల్చి చంపినట్లు తెలిపారు. ఆదివారం రాత్రి జరిగిన దాడిలో 26 మంది మరణించినట్లు స్థానిక కౌన్సిల్‌ సభ్యుడు చెప్పారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇరాక్‌లో ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదులు విచక్షణారహితంగా దాడులకు తెగబడుతున్న సంగతి తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com