మహిళలపై దాడులకు వారి వస్త్రధారణే కారణo...
- August 29, 2016
మహిళలపై దాడులకు వారి వస్త్రధారణే కారణమని గతంలో చాలామంది నేతలు వివాదస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా విదేశీ పర్యాటకులు స్కర్టులు ధరించవద్దని కేంద్రమంత్రి మహేశ్ శర్మ చేసిన వ్యాఖ్యలు కూడా వివాదస్పదమవుతున్నాయి.విదేశీ మహిళల భద్రత అంశంపై మాట్లాడిన కేంద్రమంత్రి మహేశ్ శర్మ.. భారతదేశ పర్యటనకు వచ్చిన విదేశీ పర్యాటకులు దయచేసి స్కర్టులు ధరించవద్దని సూచించారు. దేశ పర్యటనకు వచ్చే విదేశీయులు ఇక్కడ ఎలా నడుచుకోవాలి.. ఎలా నడుచుకోకూడదు లాంటి అంశాలపై అవగాహన కల్పించేందుకు..ఓ కార్డుపై ఆయా అంశాలన్నింటిని పొందుపరిచి భారత విమానాశ్రయాల్లో అడుగుపెట్టేవారికి అందజేస్తున్నామని తెలిపారు.
సాంప్రదాయిక దేశమైన భారత్ లో దేవాలయాల సందర్శనకు ప్రత్యేక డ్రెస్ కోడ్ అమలులో ఉందని.. తాజ్ మహల్ లాంటి పర్యాటక ప్రాంతాలను సందర్శించేప్పుడు విదేశీ మహిళలు స్కర్టులు ధరించివద్దని పేర్కొన్నారు. అయితే ఈ వ్యాఖ్యలపై దుమారం రేగడంతో.. వివరణ ఇచ్చుకున్నారు మహేశ్ శర్మ.విదేశీ మహిళలు తమ ఆలోచనలకు అభిరుచులకు అనుగుణంగా దుస్తులు ధరించడాన్ని తాను తప్పు పట్టట్లేదని, ఒకరి డ్రెస్సింగ్ ను మార్చుకోమని చెప్పే తనకు లేదన్నారు. విదేశీ మహిళలు పలానా డ్రెస్ లోనే ఉండాలని తాము చెప్పడం లేదన్న మహేశ్ శర్మ.. రాత్రుళ్లు బయటకు వెళ్లేటప్పుడు మాత్రం జాగ్రత్గగా ఉండాలని సలహా ఇచ్చారు.ఇదిలా ఉంటే.. కేంద్రమంత్రి మహేశ్ శర్మ స్కర్టు కామెంట్స్ పై ఢిల్లీ ఆప్ మంత్రి కపిల్ మిశ్రా ఫైర్ అయ్యారు. ఇలాంటి సలహాలతో దేశాన్ని కించపరిచే పని చేయవద్దని సూచించారాయన. అయితే కొంతమంది నెటిజెన్స్ మాత్రం కేంద్రమంత్రికి అండగా నిలబడ్డారు. దేవాలయాలు, ఇతర పవిత్ర స్థలాల్లో విదేశీయులు స్కర్టులు ధరించరాదని కేంద్రమంత్రి చేసిన సూచనతో తాము ఏకీభవిస్తున్నట్లు పలువురు నెటిజెన్స్ అభిప్రాయపడ్డారు.భారతీయ మహిళలు ఇస్లామిక్ దేశాలకు వెళ్లినపుడు బుర్ఖా, స్కార్ఫ్ లాంటి అక్కడి సాంప్రదాయ దుస్తులను ధరించాల్సిందిగా సలహా ఇవ్వాలని ఓ నెటిజెన్ కేంద్రమంత్రిని కోరడం గమనార్హం.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







