సౌదీలో భారీగా ఫేక్ ఇంజినీరింగ్ సర్టిఫికెట్లు గుర్తింపు..!!
- November 18, 2026
రియాద్: సౌదీ అరేబియాలో ఇంజినీరింగ్ వృత్తి ప్రమాణాలను కాపాడేందుకు చేపట్టిన తనిఖీల్లో మొత్తం 1,593 చెల్లని, గుర్తింపు లేని సర్టిఫికెట్లను గుర్తించినట్లు సౌదీ కౌన్సిల్ ఆఫ్ ఇంజినీర్స్ వెల్లడించింది. 2026 జనవరి నుంచి అక్టోబర్ వరకు 'మొసాదఖా' (Mosadaqa) ప్లాట్‌ఫామ్ సహకారంతో నిర్వహించిన పరిశీలనల్లో 603 చెల్లని సర్టిఫికెట్లు, 990 గుర్తింపు లేని సర్టిఫికెట్లు బయటపడినట్లు తెలిపింది.
ఇంజినీరింగ్ అర్హతలను ధ్రువీకరించడం, వృత్తిపరమైన ప్రమాణాలను కాపాడటం, ప్రొఫెషనల్ అక్రిడిటేషన్‌పై విశ్వసనీయతను పెంచడం లక్ష్యంగా ఈ తనిఖీలు చేపట్టినట్లు కౌన్సిల్ పేర్కొంది. ఇక విభాగాల వారీగా పరిశీలిస్తే అత్యధికంగా ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో 174 చెల్లని సర్టిఫికెట్లు గుర్తించారు. సివిల్ ఇంజినీరింగ్, ఆర్కిటెక్చర్, కన్స్ట్రక్షన్ విభాగాల్లో 83, మెకానికల్ ఇంజినీరింగ్‌లో 79 సర్టిఫికెట్లు బయటపడ్డాయి. మిగిలినవి ఇతర ఇంజినీరింగ్, సాంకేతిక విభాగాలకు చెందినవిగా వెల్లడించింది. చెల్లని సర్టిఫికెట్లకు సంబంధించిన కేసులను తదుపరి చర్యల కోసం సంబంధిత అధికారులకు అప్పగించినట్లు సౌదీ కౌన్సిల్ ఆఫ్ ఇంజినీర్స్ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- ఒమన్‌లో వాహనాలు, కంప్యూటర్ల చోరీ.. నిందితుడి అరెస్ట్..!!
- సౌదీ అరేబియాలో భారీ వర్షాల హెచ్చరిక.. అలర్ట్ జారీ..!!
- బహ్రెయిన్‌లో చిల్డ్రన్ డే..ప్రత్యేక అవసరాలున్న చిన్నారులతో భారత రాయబారి..!!
- దుబాయ్ ఎయిర్‌పోర్టులో ‘ఫ్యాషన్ అవెన్యూ’..!!
- ఖతార్ లో సముద్ర విజ్ఞానంపై చిన్నారులకు ప్రత్యేక శిక్షణ..!!
- కుప్పకూలిన రష్యా సైనిక విమానం.. 17 మంది మృతి
- ఎయిర్‌పోర్టుల్లో తగ్గనున్న CISF సిబ్బంది సంఖ్య!
- ఒమన్‌లో ఉల్కల పరిశోధనపై ప్రత్యేక పుస్తకం విడుదల..!!
- సౌదీలో భారీగా ఫేక్ ఇంజినీరింగ్ సర్టిఫికెట్లు గుర్తింపు..!!
- ఇరాన్‌పై బహ్రెయిన్ తీవ్ర ఆగ్రహం..!!







