ఒమన్‌లో ఉల్కల పరిశోధనపై ప్రత్యేక పుస్తకం విడుదల..!!
- November 18, 2026
మస్కట్: ఒమన్‌లో 2001 నుంచి 2025 వరకు చేపట్టిన ఉల్కల పరిశోధన వివరాలను పొందుపరుస్తూ హెరిటేజ్ అండ్ టూరిజం మంత్రిత్వ శాఖ ప్రత్యేక పుస్తకాన్ని విడుదల చేసింది. రెండు దశాబ్దాలకు పైగా సాగిన శాస్త్రీయ పరిశోధనల ఫలితాలను ఈ పుస్తకంలో వివరించారు. ఇంధన, ఖనిజాల మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ ఇంజినీర్ మొహ్సిన్ హమద్ అల్ హద్రామి ముఖ్య అతిథిగా ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది.
ఒమానీ-స్విస్ ఉల్కల పరిశోధన బృందం సహకారంతో ఈ ప్రాజెక్టును చేపట్టారు. ప్రపంచవ్యాప్తంగా ఉల్కల పరిశోధన రంగంలో ప్రముఖ శాస్త్రవేత్తలుగా గుర్తింపు పొందిన ప్రొఫెసర్ బేడా హాఫ్మన్, ప్రొఫెసర్ ఎడ్విన్ గ్నోస్ ఈ బృందానికి నాయకత్వం వహించారు. 2001 నుంచి 2025 వరకు ఒమన్ భూభాగంలో గుర్తించిన ఉల్కల నమూనాలను సేకరించడం, వాటిని నమోదు చేయడం, శాస్త్రీయంగా అధ్యయనం చేయడంపై ఈ పరిశోధనల్లో ప్రధానంగా దృష్టి సారించారు.
ఈ ప్రాజెక్టు ద్వారా ఒమన్‌లో లభించిన ఉల్కలపై శాస్త్రీయ అవగాహన మరింత పెరిగిందని మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశానికి చెందిన భౌగోళిక, ఉల్కల వారసత్వ సంపదను గుర్తించి, భద్రపరిచే ప్రయత్నాలకు కూడా ఈ పరిశోధనలు దోహదపడ్డాయని పేర్కొంది. విస్తారమైన ఎడారి ప్రాంతాలు, ప్రత్యేక భౌగోళిక పరిస్థితుల కారణంగా ఉల్కల అన్వేషణ, సేకరణ, పరిరక్షణ, పరిశోధనలకు ఒమన్ కీలక ప్రాంతంగా నిలుస్తోందని పుస్తకంలో వివరించారు. ఈ ప్రచురణతో ఒమన్‌లోని పరిశోధనా సంస్థలు, అంతర్జాతీయ శాస్త్రీయ సంస్థల మధ్య మరింత సహకారం పెరుగుతుందని మంత్రిత్వ శాఖ ఆశాభావం వ్యక్తం చేసింది.
తాజా వార్తలు
- ఒమన్‌లో వాహనాలు, కంప్యూటర్ల చోరీ.. నిందితుడి అరెస్ట్..!!
- సౌదీ అరేబియాలో భారీ వర్షాల హెచ్చరిక.. అలర్ట్ జారీ..!!
- బహ్రెయిన్‌లో చిల్డ్రన్ డే..ప్రత్యేక అవసరాలున్న చిన్నారులతో భారత రాయబారి..!!
- దుబాయ్ ఎయిర్‌పోర్టులో ‘ఫ్యాషన్ అవెన్యూ’..!!
- ఖతార్ లో సముద్ర విజ్ఞానంపై చిన్నారులకు ప్రత్యేక శిక్షణ..!!
- కుప్పకూలిన రష్యా సైనిక విమానం.. 17 మంది మృతి
- ఎయిర్‌పోర్టుల్లో తగ్గనున్న CISF సిబ్బంది సంఖ్య!
- ఒమన్‌లో ఉల్కల పరిశోధనపై ప్రత్యేక పుస్తకం విడుదల..!!
- సౌదీలో భారీగా ఫేక్ ఇంజినీరింగ్ సర్టిఫికెట్లు గుర్తింపు..!!
- ఇరాన్‌పై బహ్రెయిన్ తీవ్ర ఆగ్రహం..!!







