సుల్తాన్ హైతమ్‌కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుభాకాంక్షలు..!!
- November 21, 2026
న్యూఢిల్లీ: ఒమన్ 56వ జాతీయ దినోత్సవం సందర్భంగా ఆ దేశ సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్‌కు, ఒమన్ ప్రజలకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పంపిన సందేశంలో సుల్తాన్ హైతమ్ దూరదృష్టితో కూడిన నాయకత్వంలో ఒమన్ సాధిస్తున్న ప్రగతిని, విజయాలను రాష్ట్రపతి ప్రశంసించారు.
భారత్, ఒమన్ దేశాల మధ్య శతాబ్దాల నాటి స్నేహ సంబంధాలు ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. పురాతన సముద్ర వాణిజ్య సంబంధాల నుంచి ప్రారంభమైన ఈ బంధం ప్రస్తుతం పరస్పర విశ్వాసం, గౌరవం, ఆర్థిక సహకారం, సాంస్కృతిక అనుబంధంతో కూడిన వ్యూహాత్మక భాగస్వామ్యంగా బలోపేతమైందని తెలిపారు.
రెండు దేశాలకు శాంతియుత సహజీవనం, ఉమ్మడి అభివృద్ధి, శ్రేయస్సుపై ఒకే దృక్పథం ఉందని పేర్కొన్నారు. సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్ ఆయురారోగ్యాలతో ఉండాలని, ఒమన్ స్నేహపూర్వక ప్రజలు మరింత అభివృద్ధి, సుఖసంతోషాలతో ముందుకు సాగాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- ఖతార్లో చిన్నారుల కోసం ప్రత్యేక పార్కులు..!!
- సౌదీ అరేబియాలో భారీగా డ్రగ్స్ పట్టివేత..!!
- సుల్తాన్ హైతమ్‌కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుభాకాంక్షలు..!!
- పాత ఫోన్లోనూ 24 క్యారెట్ల బంగారం..!!
- 2026లో కువైట్ చమురేతర రంగం 1.5% వృద్ధి..!!
- దుబాయ్ రన్ 2026కు రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. ఫుల్ గైడ్..!!
- ఖతార్లో నవంబర్ 26, 27 తేదీల్లో ‘పాసేజ్ టు ఇండియా 2026’..!!
- కువైట్లో 30 శాతం పెరిగిన రెంట్స్..!!
- హౌతీలపై సౌదీ నేతృత్వంలో భారీ సైనిక ఆపరేషన్..!!
- ఒమన్ యువతకు శుభవార్త..!!







