పాఠశాల బస్సుల కోసం వేచి ఉండే తల్లిదండ్రులు పిల్లలని వదిలరాదని హెచ్చరిక
- September 01, 2016
మస్కట్ - పాఠశాల బస్సుల కోసం వేచి ఉండే తల్లిదండ్రులు పిల్లలని వదిలరాదని తల్లిదండ్రులు మరియు సంరక్షకులకు రాయల్ ఒమాన్ పోలీస్ సూచించారు. ఉష్ణోగ్రతలు ఇప్పటికీ ఉదయం పూట అధికంగా ఉన్నాయని తెలిపారు. ఈ వాతావరణం సురక్షితం కాదు. తల్లిదండ్రులు పిల్లల క్షేమం సంరక్షించాలని సీనియర్ రాయల్ ఒమాన్ పోలీస్ అధికారి తెలిపారు.
పిల్లలు తరచూ రోడ్డు పక్కన ఆడుతూ కనిపిస్తున్నారని అన్నారు. భారీ ట్రాఫిక్ రద్దీ ఉన్నప్పుడు ఉదయం సమయంలో పిల్లల భద్రత కోసం, వారి తల్లిదండ్రులు లేదా ఇతర పెద్దలు వారితో కూడి ఉండాలి. అని అన్నారు కొందరు తల్లిదండ్రులకు ఒకరి కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నప్పుడు పాఠశాల వెళుతున్న సమయంలో వారిని నియంత్రంచడం చాలా కష్టం అని చెబుతారు. "నాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. వేర్వేరు సమయాల్లో వారిని వివిధ బస్సులలో పాఠశాలలకు తీసుకువెళ్ళాలి. నేను వారిని జాగ్రత్తగా గమనింపకుండా ఉన్నట్లయితే అది వారికి ఎంతో అపాయకరమని నాకు తెలుసు కానీ నేను ఎటువంటి ఆందోళనలు లేకుండా సిద్ధంగా ఒక ప్రణళిక సిద్ధం చేసుకొంటానని ఫాతియా ఖలాఫ్ అనే ఒక తల్లి చెప్పారు.
తాజా వార్తలు
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్







