ప్రపంచ దేశాలకు అయిలాన్ తండ్రి విజ్ఞప్తి
- September 01, 2016
సిరియాలో గత ఐదేళ్లుగా కొనసాగుతున్న రక్తపాతానికి ఇకనైనా తెరదిం చేందుకు చొరవ చూపాలని సిరియాకు చెందిన అబ్దుల్లా కుర్ది ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేశారు. గత ఏడాది సెప్టెంబర్‌లో సిరియా నుండి ఐరోపా దేశాలకు వలస వెళ్తూ పడవ మధ్యధరా సముద్రంలో మునిగిన ఘటనలో టర్కీ తీరానికి చేరిన మూడేళ్ల చిన్నారి ఐలాన్ కుర్ది మృతదేహం ప్రపంచ వ్యాప్తంగా కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. తన కుమారుడు ఐలాన్ కుర్ది వంటి వారు అనేక మంది ప్రాణాలు కోల్పోయి ఏడాది గడచినా సిరియాలో అశాంతికి తెరపడక పోవటం విచారకరమని ఆయన జర్మనీకి చెందిన ఒక పత్రికకు ఇచ్చిన ఇంట ర్వ్యూలో పేర్కొన్నారు.
తన కుమారుడి మృతి అనంతరం ఇటువంటి ఘటనలకు మరోసారి తావివ్వబోమంటూ పలువురు రాజకీయ నేతలు చెప్పిన మాటలు ఇప్పటికీ నీటి మూటలుగానే మిగిలాయన్నారు. సముద్రతీరాన పడివున్న తన కుమారుడి ఫొటో ప్రపంచ వ్యాప్తంగా ఎందరినో కదిలించిందని, ప్రతిఒక్కరూ ఏదో ఒకటి చేయాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని ఆయన గుర్తు చేశారు. అయితే ఇప్పటి వరకూ ఈ దిశగా జరిగిందేమీ లేదని, ప్రజలు ఇప్పటికీ వలసబాటలో ప్రాణాలు కోల్పోతూనే వున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మధ్యధరా సముద్రంలో తన భార్య, కుమారులను పొట్టనపెట్టుకున్న ఈ విషాద ఘటన జరిగి ఏడాది పూర్తయిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ ఇంటర్వ్యూ జరుగుతున్న సేపూ తన కుటుంబానికి ఎదురైన విషాదాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన కన్నీరు మున్నీరయ్యారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







