ఏటీఎం దొంగ దోచేశాడు
- September 02, 2016
ఎటీఎం దొంగ ఒకరు, ఇంకొకరి కార్డు వివరాలతో, వారి అకౌంట్లోని సొమ్ము మొత్తం కాజేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. సిట్టీ సౌదా బేంగ్కోలా అనే ఫిలిప్పినీ మహిళకు ఆమె పనిచేస్తున్న సంస్థ నుంచి ఆమె ఖాతాలోకి డబ్బు చేరింది. అయితే ఆమె రెండు రోజుల తర్వాత బ్యాంకు ఏటీఎం నుంచి డబ్బుల్ని డ్రా చేసేందుకు ప్రయత్నించగా, అప్పటికే ఆమె అకౌంట్ ఖాళీ అయిపోయింది. విషయం తెలుసుకున్న బాధిత మహిళ తన బ్యాంకు అధికారుల్ని కలిసి పరిస్థితిని వివరించి, ఫిర్యాదు చేసింది. ఈ విషయంపై స్పందించిన ఇత్మార్ బ్యాంక్, ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకున్నట్లు వెల్లడించింది. అయితే ఏటీఎం దొంగ, పూర్తి వివరాలతో పక్కాగా దొంగతనం చేసినట్లు బ్యాంకు అధికారులు గుర్తించారు. ఖాళీ చేసిన ఏటీఎంకి చెందిన బ్యాంకు వర్గాలు కూడా ఇదే విషయాన్ని ధృవీకరించాయి. తమ ఖాతాదారుల్ని పిన్ నెంబర్, కార్డుకి సంబంధించిన ఇతర వివరాలపై పూర్తిస్థాయిలో అప్రమత్తం చేస్తున్నప్పటికీ ఇలాంటి నేరాలు జరుగుతుండటం పట్ల ఆందోళన వ్యక్తం చేశాయి. కేసుని విచారిస్తున్న పోలీసులు, నిందితుడి ఆచూకీ కనుక్కునేందుకు ప్రయత్నిస్తున్నారు.
తాజా వార్తలు
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!







