కువైట్ లో " స్పైస్ " రసాయనిక మాదక ద్రవ్య పదార్ధాన్ని నేరస్థుల చెలామణి

- September 03, 2016 , by Maagulf
కువైట్ లో

కువైట్:  "స్పైస్"  కెమికల్  డ్రగ్ గా వ్యవహరించే ఈ మత్తు పదార్ధాన్ని కువైట్ లో నేరస్తులు రహస్యంగా వ్యాపారం చేయడం ఒక తీవ్రమైన నేరమని  చట్టపరమైన వ్యవహారాలు మరియు ఆరోగ్య  అంతర్గత మంత్రిత్వ శాఖ  సహాయ కార్యదర్శి  మహమౌద్ అల్ అబ్దుల్హాది  శుక్రవారం  కునలో మంత్రిత్వశాఖ ఉన్నతాధికారుల సమావేశంలో తెలిపారు.

నేర ప్రేరితమైన ఈ పదార్ధంని దేశంలో వెంటనే నిలువరించాలని ఆయన పేర్కొంటూ, అవగాహన కోసం పలు  ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తామని ఆయన చెప్పారు.కువైట్ ఆరోగ్య మంత్రి  డాక్టర్ ఆలీ సాద్ అల్  రెండు రోజుల క్రితం జారీ చేసిన  ఒక పత్రంలో సంతకం చేసిన  క్రమంలో అది వచ్చే వారం  అధికారిక గెజిట్లో ప్రచురించబడనుంచని డాక్టర్ అబ్దుల్హాది చెప్పారు. " స్పైస్ " అనే  రసాయనిక మాదక ద్రవ్యపదార్ధంని మా యువత   ఆరు రసాయన సమూహాలుగా వర్గీకరించి  ఉపయోగిస్తున్నట్లుగా  ఆయన పేర్కొన్నారు. ఈ  మాదక ద్రవ్య పదార్ధం నుండి సేకరించిన 1,500 ఉత్పన్న పదార్థాలు వారికి పలు రూపాలలో రహస్యంగా చేరుకొంటున్నాయని వివరించారు. ఎవరికీ అనుమానం రాకుండా ఈ పదార్ధాలు గతంలో చట్టపరమైనవిగా కొనసాగుతున్నట్లు ఆయన తెలిపారు. అయితే,ఇప్పుడు తమ యువత కనుక  " స్పైస్ " ని   వినియోగిస్తే  కొకైన్, హెరాయిన్, కాప్తగోన్  మరియు పేత్తిడినే  ఇతర మందుల వినియోగంలో మాదిరిగా తీవ్రమైన నేరంగా పరిగణించబడుతుందని ఆయన హెచ్చరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com