ఓక్లహామాలో భారీ భూకంపం
- September 03, 2016
అమెరికాలోని నార్త్ సెంట్రల్ ఓక్లహోమాలో శనివారం ఉదయం 7.02 గంటలకు భూకంపం సంభవించింది. నెబ్రస్కా నుంచి నార్త్ టెక్సాస్ వరకూ ప్రకంపనలు వచ్చాయని, భూకంప తీవ్రత 5.6గా నమోదైందనీ అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. నవంబర్ 2011 తర్వాత వచ్చిన బలమైన భూకంపం ఇదని అంటున్నారు. ఆస్తి, ప్రాణనష్టంపై వెంటనే వివరాలు తెలియలేదు. కన్సాస్ సిటీ, సెయింట్ లూయిస్, మిస్సోరి, ఫయెట్టెవిల్లె, అర్కాన్సస్, దెస్ మొయినెస్, లోవ, నార్మన్, ఓక్లహామీలలో భూప్రకంపనల ప్రభావం కనిపించింది. భూకంపం వల్ల తమ స్టూడియో కూడా కంపించినట్టు డల్లాస్ టీవీ స్టేషన్ డబ్లుఎఫ్ఏఏ ఒక ట్వీట్లో తెలిపింది. ఓక్లహామాకు వాయవ్యంగా 9 మైళ్ల దూరంలో భూకంప నమోదు కేంద్రాన్ని గుర్తించారు.
తాజా వార్తలు
- ఐఫోన్ ఎగుమతుల్లో చరిత్ర సృష్టించిన భారత్
- మస్కట్ చేరుకున్న ప్రధాని మోదీ
- సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లపై కేంద్ర ప్రభుత్వం కొరడా
- చరిత్రలో నిలిచేలా TTD నిర్ణయాలు..!
- ANR కాలేజీకి నాగార్జున రూ.2 కోట్ల విరాళం
- కోడూరు అవుట్‌ఫాల్ స్లూయిస్ల పునర్నిర్మాణం: ఎంపీ బాలశౌరి
- ఏపీ సీఆర్డీఏ నోటిఫికేషన్ విడుదల
- కార్తీక్ శర్మ: ఐపీఎల్ 2026 వేలంలో 14.2 కోట్లు..
- రేపు నటుడు విజయ్ భారీ ర్యాలీ
- శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌కు చేరుకున్న రాష్ట్రపతి







