52 వేలమంది అక్రమ యాత్రికులకు మక్కా ప్రవేశంకి నిరాకరణ
- September 05, 2016
మనామా: దాదాపు 52 వేలమంది ప్రజలకు సరైన అనుమతులు కలిగిలేనందున ముస్లింల పవిత్ర నగరం మక్కా నుండి వెనుదిరిగి పంపించి వేశారు.
హజ్ ఆచారాలు ప్రారంభించడానికి కొన్ని రోజుల ముందు ఆ యాత్రికులను వెనక్కి తిరిగి పంపించివేశారు
హజ్ యాత్ర ఇస్లాం మతం యొక్క ఐదవ స్థంభంగా ఉంది. జీవితకాలంలో ఒక్కసారైనా ఈ పుణ్యక్షేత్రంని దర్శించుకోవాలని ముస్లింలు అభిలషిస్తారు. సుమారు 24 వేల కార్లని సైతం చెల్లుబాటు అనుమతులు లేని కారణంగా భద్రతా అధికారులు మక్కా లోనికి ప్రవేశించకుండా నిరోధించబడ్డారని బహిత భద్రతా కేంద్రం అధిపతి మొహమ్మద్ అల్ హారతి " మా గల్ఫ్ డాట్ కామ్ " కు తెలిపారు.
మక్కా యాత్రకు ప్రయాణించే ముందు వారి పత్రాలు సరైన క్రమంలో ఉండేలా చూసుకోవాలని ఆయన యాత్రికులను కోరారు. ఈ యాత్రికులకు చెందిన దేశాలలో ఏ విధంగా హాజ్ కు చేరుకోవాలనే విషయంపై భారీ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ ప్రతి సంవత్సరం వేలాదిమంది యాత్రికులని వెనక్కి పంపించవేయాల్సి వస్తుందని ఆయన అన్నారు. చాలామంది వేగంగా హాజ్ యాత్రకు పంపించేవారి కోసం చూస్తున్నారు కానీ, గుర్తింపు పొందిన హజ్ ఆపరేటర్ల ద్వారా సరైన అనుమతులని పొందేందుకు ప్రయత్నించడం లేదని అన్నారు. బహ్రయినీయులు మరియు ఇతర గల్ఫ్ దేశాల సమాఖ్య పౌరులు సౌదీ అరేబియా ప్రవేశ వీసాలు అవసరం లేదు.ఈ ఏడాది సెప్టెంబర్ 10 వ తేదీన ప్రారంభమై ఐదు రోజుల పాటు కొనసాగే హాజ్ కు మూడు మిలియన్ల మంది యాత్రికులు హాజరుకానున్నట్లు అంచనా వేస్తున్నారు.
తాజా వార్తలు
- ట్రంప్ కీలక నిర్ణయం
- ఊరట.. స్కూల్ ట్రాన్స్ పోర్టు పై 60% ఫీజు తగ్గింపు..!!
- అనధికార న్యాయ సేవలకు వ్యతిరేకంగా ఒమన్ హెచ్చరిక..!!
- ఫ్లైయింగ్ టైగర్ గ్లాసులను వాడొద్దని యూఏఈ హెచ్చరిక..!!
- కువైట్ అమీర్‌కు క్రెడెన్షియల్స్ సమర్పించిన భారత రాయబారి..!!
- 118 మిలియన్లకు పైగా ఆర్డర్లతో డెలివరీ సెక్టర్ 49% వృద్ధి..!!
- యూఏఈ–ఒమన్ హఫీత్ రైల్ ప్రాజెక్ట్ 40% పూర్తి..!!
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం









