ఫైనల్స్‌లోకి ఇండియా, పాకిస్తాన్ విద్యార్థులు
- September 05, 2016
సెప్టెంబర్ 19 ఉంచి 22 వరకు పారిస్‌లో జరిగే యాన్యువల్ గ్లోబల్ 'గో గ్రీన్ ఇన్ ది సిటీ' కార్యక్రమం కోసం 12 మందిలో పోటీ పడేందుకు మస్దార్ ఇన్స్టిట్యూట్ నుంచి ఇద్దరు విద్యార్థులు ఎంపకియ్యారు. భారత జాతీయుడైన హిబా రియాజ్, పాకిస్తాన్‌కి చెందిన అర్సలన్ అంజుమ్ 'సోలార్ వే' ప్రాజెక్ట్‌తో 1183 టీమ్స్‌తో పోటీ పడి ముందడుగు వేశారు. క్లీన్ ఎనర్జీలో భాగంగా వీరు చేపట్టిన కార్యక్రమానికి మంచి స్పందన లభిస్తోంది. 12 కిలోమీటర్ల సోలార్ వే 2.5 మిలియన్ కిలో వాట్స్ / అవర్ పవర్‌ని జనరేట్ చేస్తుందని అంజుమన్ మరియు రియాజ్ వెల్లడించారు. వీరిద్దరూ మైక్రోసిస్టమ్స్ ఇంజనీరింగ్‌ని మస్దార్ ఇన్స్టిట్యూట్లో అభ్యసిస్తున్నారు. సెప్టెంబర్‌లో విజేతల్ని ప్రకటిస్తారు. ఎనర్జీ లీడర్ ద్వారా విజేతలకు ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. 100 మంది సెమీ ఫైనలిస్ట్స్ నుంచి 12 మంది సెలక్ట్ కావడం అంటే చిన్న విషయం కాదని ఈ సందర్భంగా నిర్వాహకులు తెలిపారు. నాలుగు రోజులపాటు జరిగే ఫైనల్లో బిజినెస్ వర్క్ షాప్స్, నెట్వర్కింగ్ ఈవెంట్స్, సిటీ టూర్స్ మరియు మెయిన్ ప్రెజెంటేషన్స్ ఉంటాయి. ఈ ఏడాది మొత్తం 16,400 రిజిస్ట్రేషన్స్ నమోదయ్యాయి. 2015లో వీటి సంఖ్య 12,800.
తాజా వార్తలు
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్‌తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్
- ఏప్రిల్ 26 నుండి జజీరా ఎయిర్వేస్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం
- యువ టెక్ మేధస్సుల కోసం 'టినీ టెక్నీస్-2కే26' టెక్నో స్కిల్స్ బూట్‌క్యాంప్
- SR 4 మిలియన్ల ఫైన్స్ వేసిన ఆరోగ్య బీమా మండలి..!!
- కువైట్ లో సామాజిక సమావేశాల పై నిషేధం ఎత్తివేత..!!
- షార్జాలోని అల్ ధైద్‌లో 13 టన్నుల పాడైన ఫుడ్ ధ్వంసం..!!
- విదేశాంగ మంత్రితో అమెరికా రాయబారి సమావేశం..!!
- అల్ సీబ్‌లో డ్రగ్ కలకలం..అరబ్ జాతీయుడు అరెస్టు..!!









