సిరియా లో జంటబాంబు పేలుళ్లు: 43 మంది మృతి
- September 05, 2016
సిరియాలో ఉగ్రవాదులు దేశవ్యాప్తంగా పలుచోట్ల దాడులు చేశారు. టార్టస్ నగరం శివారులో చెక్ పాయింట్ వద్ద సోమవారం జంటబాంబు పేలుళ్లు సంభవించడంతో కనీసం 43 మంది మరణించారు.
పేలుడు పదార్థాలను తీసుకెళ్తున్న వాహనాన్ని భద్రత దళాలు తనిఖీ చేస్తున్న సమయంలో పేలుడు సంభవించింది. ఈ దాడిలో గాయపడిన సైనికులను కాపాడేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో మరో ఉగ్రవాది ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. మిలటరీ యూనిఫామ్ లో వచ్చిన బాంబర్లు భద్రత దళాలు లక్ష్యంగా దాడి చేశారు. ఇదే రోజు హామ్స్ ప్రావిన్స్ లో ఓ చెక్ పాయింట్ వద్ద మరో కారు బాంబు పేలుడు సంభవించింది. కాగా ఎవరికీ హాని జరిగినట్టు వార్తలు రాలేదు. సిరియా రాజధాని డమాస్కస్ లో కూడా ఉగ్రవాదులు దాడి చేశారు.
తాజా వార్తలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్‌లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు







