మార్స్ పోస్టర్ కాంపిటీషన్ ప్రారంభం
- September 06, 2016
దుబాయ్: అండర్ గ్రాడ్యుయేట్లు, గ్రాడ్యుయేట్లు 20,000 దిర్హామ్‌లకు పైగానే విలువగల బహుమతులు గెలిచే ఛాన్స్ రానే వచ్చింది. మార్స్‌పై రీసెర్చ్ నేపథ్యంలో ఔత్సాహికులు ఎవరైనా తమ ఆలోచనల్ని పోస్టర్ రూపంలో ప్రదర్శించగలగాలి. అలా వచ్చిన బెస్ట్ పోస్టర్స్‌కి 20,000 దిర్హామ్‌ల బహుమతి దక్కనుంది. మొహమ్మద్ బిన్ రషీద్ స్పేస్ సెంటర్ (ఎంబిఆర్‌ఎస్‌సి) ఈ కాంపిటీషన్‌ని ప్రకటించింది. 'ఎక్స్‌ప్లోర్ మార్స్ పోస్టర్ కాంపిటీషన్' పేరుతో దీన్ని నిర్వహిస్తారు. జియాలజీ, అట్మాస్ఫియర్, హాబిటబిలిటీ ఆఫ్ మార్స్ వంటి అంశాలపై డెప్త్ రీసెర్చ్ వంటి విభాగాల్లో కాంపిటీషన్‌ని నిర్వహించనున్నారు. ఆన్‌లైన్ ద్వారా ఔత్సాహికులు తమ వివరాల్ని రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 8 లోపు ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయాలిష్ట్ర్స ఉంటుంది. పోస్టర్స్ సబ్‌మిట్ చేయడానికి ఆఖరు తేదీ సెప్టెంబర్ 28. ప్రముఖ జాతీయ అంతర్జాతీయ శాస్త్రవేత్తలు జడ్జిలుగా వ్యవహరిస్తారు. అక్టోబర్ 3న జరిగే ఇఎంఎం సైన్స్ వర్క్‌షాప్‌లో విజేతల్ని ప్రకటిస్తారు. తొలి బహుమతి విజేత 10,000 దిర్హామ్‌లు, రెండో విజేత 7,000 దిర్హామ్‌లు, మూడో బహుమతి విజేత 5,000 దిర్హామహల బహుమతి గెలచుకునే అవకాశం ఉంది. వివరాలకు ఎంబిఆర్‌ఎస్‌సి వెబ్‌సైట్‌ని సంప్రదించగలరు.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







