'ఎమిరేట్స్' విమాన ప్రమాదంపై ప్రాథమిక నివేదిక

- September 06, 2016 , by Maagulf
'ఎమిరేట్స్' విమాన ప్రమాదంపై ప్రాథమిక నివేదిక

గత నెలలో దుబాయ్ విమానాశ్రయంలో జరిగిన ఎమిరేట్స్ విమాన ప్రమాదంపై ప్రాథమిక దర్యాప్తు నివేదికను మంగళవారం అధికారులు వెల్లడించారు. ల్యాండ్ అవుతున్న విమానాన్ని తిరిగి పైకి తీసుకెళ్లే క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లు విశ్లేషించారు. ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ చరిత్రలోనే ఘోర ప్రమాదంగా ఇది రికార్డుకెక్కింది. అయితే అదృష్టవశాత్తూ 300 మంది ప్రయాణికులు సిబ్బంది ప్రాణాలతో బయటపడ్డారు. మంటలను అదుపుచేసే క్రమంలో అగ్నిమాపక సిబ్బంది ఒకరు మృతి చెందారు.

ఈ విమాన ప్రమాదంపై అరబ్ ఎమిరేట్స్ పౌర విమాన అధికార యంత్రాంగం దర్యాప్తు జరిపింది. ఫ్లైట్ డేటా, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో సంభాషణ, ఆయా రంగాల విశ్లేకుల ఇంటర్వూలతో కూడిన 28 పేజీల నివేదికను రూపొందించారు.

కేరళలోని తిరువనంతపురం నుంచి దుబాయ్ విమానాశ్రాయానికి చేరిన ఈ విమానాన్ని ల్యాండింగ్ చేసేందుకు పైలట్ ప్రయత్నించాడు. అయితే రన్ వేపై దిగినంతలోనే మళ్లీ పైకి ఎగిరించే క్రమంలో ముందు చక్రం తెరుచుకోలేదు. అప్పటికే 125 నాట్స్ వేగంతో విమానం ముందు భాగం రన్‌వేను తాకి కొంతదూరం దూసుకెళ్ళింది. ఆ రాపిడికి విమానం ఇంజన్‌కు మంటలు అంటుకోవడంతో కొద్ది క్షణాల్లో అది పూర్తిగా కాలిపోయింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com