'మజ్ను' గీతాలు విడుదల..
- September 06, 2016
నా ని కథానాయకుడిగా నటించిన చిత్రం 'మజ్ను'. అను ఇమ్మాన్యుయల్, ప్రియా శ్రీ కథానాయికలు. విరించి వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. పి.కిరణ్, గోళ్ల గీత నిర్మాతలు. గోపీ సుందర్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని గీతాలు హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. తొలి సీడీని నాని విడుదల చేశారు. రాజ్ తరుణ్ అందుకొన్నారు. ప్రచార చిత్రాల్ని దిల్‌రాజు, సుధాకర్‌రెడ్డి, అనిల్ సుంకర సంయుక్తంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ ''అందర్నీ నవ్వించే సినిమా ఇది. సినిమా చూసి ఇంటికెళ్లినా మజ్నునే గుర్తొస్తాడు. విరించి వర్మ రాసుకొనే ప్రతి కథలో, ప్రతీ పాత్రలో నిజాయతీ కనిపిస్తుంది.
'ఉయ్యాల జంపాల' కథ నాకే ముందు వినిపించాడు. కానీ అప్పుడు కుదర్లేదు. 'ఉయ్యాల జంపాల' కంటే 'మజ్ను' మంచి సినిమా అవుతుంది. గోపీ సుందర్ పాటలు బాగున్నాయి.
నా సినిమాల్లో ఇదే బెస్ట్ ఆల్బమ్'' అన్నారు. దర్శకుడు చెబుతూ ''ఇష్టమా, ప్రేమా? అనే గందరగోళం ప్రతీ బంధంలోనూ కనిపిస్తుంటుంది. ఈప్రేమ ఎన్ని రోజులో..
అనే గందరగోళం సహజమే. అలాంటి ఆలోచనలున్న కుర్రాడి కథ ఇది. వినోదం, ప్రేమ, సంగీతం.. ఇవన్నీ చక్కగా కుదిరాయ''న్నారు దర్శకుడు.
''ప్రేమకీ, సంగీతానికీ భాష అవసరం లేదు. ఈ పాటలు విని 'నా కెరీర్‌లోనే ఇది బెస్ట్ ఆల్బమ్' అని నాని చెప్పడం ఆనందాన్నిచ్చింది. రామజోగయ్య శాస్త్రి చక్కటి సాహిత్యం అందించార''న్నారు గోపీ సుందర్. ''కిరణ్ మంచి కథల్ని ఎంచుకొంటారు.
నాని వరుసగా నాలుగు విజయాలు అందుకొన్నాడు. ఇది ఐదవ విజయం అవుతుందన్న నమ్మకం ఉంద''న్నారు దిల్‌రాజు. ఈ కార్యక్రమంలో నారాయణదాస్, కల్యాణ్ కృష్ణ, మారుతి, ఇంద్రగంటి మోహనకృష్ణ, సునీల్, అనిల్ సుంకర, హను రాఘవపూడి తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్‌లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్







