వలసదారుల కోసం ప్రత్యేక హాస్పిటల్స్
- September 06, 2016
కువైట్: హెల్త్ మినిస్టర్ అలి అల్ ఒబైది, వలసదారుల కోసం ప్రత్యేకంగా ఆసుపత్రులకు అనుమతివ్వబోతున్నట్లు వెల్లడించారు. ఇప్పటిదాకా మెజారిటీ వలసదారులు మినిస్ట్రీ నిర్వహిస్తోన్న ఆసుపత్రుల్లో వైద్య చికిత్స కోసం మొగ్గు చూపుతున్నారు. ఏడాది కాలానికిగాను 50 కువైటీ దినార్స్ చెల్లించి, అవసరమైన మెడికల్ సర్వీసుల్ని మినిస్ట్రీ ఆసుపత్రులు మరియు కేంద్రాల్లో పొందుతున్నారు వలసదారులు. అలాగే వలసదారులు, సర్జరీలు, హాస్పిటల్ సే, రేడియాలజీ పరీక్షల కోసం అదనంగా చెల్లిస్తున్నారు. ఇది కాకుండా పబ్లిక్ క్లినిక్స్‌కి వెళితే 1 కువైట్ దినార్, క్యాజువాలిటీ సేవల కోసం 2 కువైట్ దినార్స్‌ని ప్రతి విజిట్‌కి చెల్లించడం జరుగుతోంది. ఇక నుంచి వలసదారులకు ప్రత్యేకంగా ఆసుపత్రుల్ని ఏర్పాటు చేసి, ప్రత్యేక ఇన్సూరెన్స్ స్కీమ్ ద్వారా వారికి సేవలందించేందుకు ప్రయత్నిస్తున్నట్లు మినిస్టర్ ఆఫ్ హెల్త్ అలి అల్ ఒబైది చెప్పారు. ఈ విధానంతో మినిస్ట్రీ ఆసుపత్రులకు వలసదారుల తాకిడి తగ్గుతుందని, సిటిజన్స్‌కి సేవలు ఎక్కువగా అందుతాయని ఆయన వివరించారు. ఇంకో వైపున వలసదారులు దేశంలో నివసించడానికి సంబంధించి సవరణలతో కూడిన విధి విధానాల్ని అమల్లోకి తీసుకురావాలనే ఆలోచన కూడా జరుగుతోంది. అలాగే వాటర్, ఎలక్ట్రిసిటీ విషయాల్లోనూ వలసదారులతో పోల్చితే పౌరులకు వెసులుబాట్లు కల్పించాలనీ, వలసదారులకు ఆ వెసులుబాట్లు తగ్గించాలనే ప్రతిపాదనలు తెరపైకి వచ్చాయి. వీటన్నిటిపైనా సమాలోచనలు జరుగుతున్నాయనీ త్వరలోనే అమల్లోకి వస్తాయని అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి.
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- NRI TDP గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్‌తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్‌కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం









