దసరాకి ఆరు ఏడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫైట్ ..
- September 07, 2016
పండుగలకు కొత్త సినిమాలు రిలీజ్ కావడం ఆనవాయితీగా మారింది. గతంలో పెద్ద హీరోల సినిమాల నుండి చిన్న హీరోల సినిమాలు అన్నీ కూడా పెద్ద పండుగలకు రిలీజ్ అయ్యేందుకు రెడీ అయ్యేవి. కాంపిటీషన్ ఎక్కువుంటాయని తెలిసిన కూడా నిర్మాతలు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వరుస సినిమాలను లైన్లో పెట్టేసేవారు. ఇప్పుడు ఈ దసరాకి కూడా అలాంటి పరిస్థితే రానుంది. దాదాపు ఆరు ఏడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫైట్‌కి దిగపోతున్నాయి. ఈ నేపధ్యంలో ప్రకాశ్ రాజ్ కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు.దసరా బరిలో నిలిచేందుకు ముందుగా రామ్ చరణ్ తన బెర్త్‌ని ఫిక్స్ చేసుకున్నాడు. ధృవ అనే టైటిల్ తో రానున్న చిత్రం త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకొని అక్టోబర్ లో రిలీజ్ అయ్యేందుకు రెడీ అయింది.అయితే మొన్నటి వరకు ఈ చిత్రానికి పోటీ ఉండదని భావించారు. కాని అనుకోకుండా అనేక సినిమాలు దసరా బరిలో పోటీ పడేందుకు రెడీ అయ్యాయి. చందు మొండేటి, చైతూ కాంబినేషన్ లో తెరకెక్కిన ప్రేమమ్ సెప్టెంబర్లోనో రిలీజ్ కావలసి ఉన్నా అనుకోకుండా ఈ చిత్రం దసరా రేసులోకి వెళ్లింది. మరోవైపు సెప్టెంబరు నెలాఖర్లో అనుకున్న కళ్యాణ్ రామ్-పూరిల 'ఇజం' కూడా దసరాకే వస్తుందంటున్నారు దసరాకి ఒకవైపు టాలీవుడ్ సినిమాల హడావిడే ఎక్కవ ఉంటుందనుకుంటే రెండు డబ్బింగ్ సినిమాలు కూడా దసరాకే రానున్నట్టు తెలుస్తోంది. తెలుగు, తమిళం, హిందీ బాషలలో రానున్న అభినేత్రి చిత్రం అక్టోబరు 7న విడుదల కానున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రంలో తమన్నా ప్రభుదేవాలు ప్రధాన పాత్రలలో నటించారు. మరోవైపు కన్నడ కుర్రాడు, మాజీ ప్రధాని దేవేగౌడ మనవడు నిఖిల్ కుమార్ హీరోగా పరిచయవుతున్న 'జాగ్వార్'ను దసరా సీజన్లోనే బరిలోకి దించుతున్నారు.ఇప్పటికే పలు సినిమాల మధ్య రసవత్తర పోరు జరుగుతుందనుకుంటున్న నేపధ్యంలో ప్రకాశ్ రాజ్ 'మన ఊరి రామాయాణం సినిమాతో దసరా కి వచ్చేస్తున్నాడు. రీసెంట్గా సినిమా రిలీజ్ డేట్ తో పోస్టర్ కూడా రిలీజ్ చేశాడు. మరి ఇన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫైట్‌కి దిగుతున్న నేపథ్యంలో ఏ సినిమాకు ఎన్ని కలెక్షన్లు వస్తాయనేది ఆసక్తికరంగా మారింది. రానున్న రోజుల్లో దసరాని టార్గెట్ చేసుకొని ఇంకెన్ని సినిమాలు పోటీ పడతాయో చూడాలి.
తాజా వార్తలు
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్‌లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..









