హజ్‌పై రాజకీయాలొద్దు: ఇరాన్‌కి తెలిపిన ఓఐసి

- September 07, 2016 , by Maagulf
హజ్‌పై రాజకీయాలొద్దు: ఇరాన్‌కి తెలిపిన ఓఐసి

దుబాయ్‌: జెడ్డా కేంద్రంగా పనిచేస్తున్న ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ ఇస్లామిక్‌ కార్పొరేషన్‌ (ఓఐసి), సౌదీ ప్రభుత్వం హజ్‌ యాత్రీకుల కోసం చేపడ్తున్న కార్యక్రమాల్ని అభినందిస్తున్నట్లు తెలిపింది. ఓఐసి మీడియా డిపార్ట్‌మెంట్‌ హెడ్‌ మహా అకీల్‌ మాట్లాడుతూ ఈ విషయాల్ని వెల్లడించారు. హజ్‌ యాత్ర సంద్భంగా గత ఏడాది చోటు చేసుకున్న పరిణామాలపై తీవ్రంగా స్పందించారు ఇరానియన్‌ సుప్రీం లీడర్‌ అయాతోల్లా అలిఖామెనె. ప్రపంచంలోని ముస్లిం సమాజం, ముస్లిం దేశాలు, హోలీ మాస్క్‌ల నిర్వహణ విషయంలో ప్రత్యామ్నాయాల గురించి ఆలోచించాల్సిందిగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేసినట్లు ఇరానీ మీడియా వెలుగులోకి తెచ్చింది. అయితే, అలాంటి అవసరం ఏమీ లేదని ఓఐసి స్పష్టం చేసింది. పవిత్ర హజ్‌ యాత్ర విషయంలో ఇలాంటి రాజకీయాలు ఏమాత్రం తగవని ఓఐసి పేర్కొంది. హజ్‌ యాత్ర సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలు దురదృష్టకరమనీ, ఈ ఘటన నేపథ్యంలో సౌదీ ప్రభుత్వం స్పందించిన తీరు అభినందనీయమని ఓఐసి వర్గాలు తెలిపాయి. 400 యాత్రీకుల మరణంతో ఇరాన్‌, హజ్‌ యాత్రను మూడేళ్ళపాటు (80ల చివర్లో) నిషేధించింది. సౌదీ అరేబియా విషయంలో ఇరాన్‌ మొదటి నుంచీ గుర్రుగా ఉన్నా, గతంలో కన్నా ఎక్కువగా ఈసారి సౌదీపై విషం చిమ్ముతోందని పలువురు అభిప్రాయపడ్డారు. ఖతార్‌లోని మిడిల్‌ ఈస్టర్న్‌ స్టడీస్‌ ప్రొఫెసర్‌ మజౌబ్‌ అల్‌ జెవెరి మాట్లాడుతూ, సౌదీని విమర్శించడంలో ఇరాన్‌ లీడర్లు అత్యుత్సాహం చూపుతున్నట్లు పేర్కొన్నారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com