దుబాయ్ - అల్ ఐన్ రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

- September 07, 2016 , by Maagulf
దుబాయ్ - అల్ ఐన్ రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

దుబాయ్ : స్థానిక దుబాయ్ - అల్ ఐన్ రోడ్డుపై ఆసియా దేశానికి చెందిన ఒక వ్యక్తి రోడ్డు ప్రమాదంలో  మరణించగా మరో ముగ్గురు గాయాలపాలయ్యారు. మంగళవారం ఒక మినీబస్సు  దుబాయ్ అల్ ఐన్ రోడ్డు పక్కన  నిలిపిన సమయంలో  ఒక పికప్ ట్రక్ వేగంగా వచ్చి మినీబస్సుని  ' ఢీ ' కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. శోధన మరియు రెస్క్యూ శాఖ, డిఫికల్టీ మిషన్ టాస్క్ఫోర్స్ నుండి  మేజర్ ఆలీ అల్ నాక్బి మాట్లాడుతూ, తమ శాఖ నుండి ఒక జట్టు,  ఫోరెన్సిక్స్ , దుబాయ్ సివిల్ డిఫెన్స్ నుండి మరొక  జట్టు తక్షణమే  ప్రమాద స్ధలానికి  చేరుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ రోడ్డు ప్రమాదంలో మినీబస్సు డ్రైవర్ ఘటనా స్థలంలోనే మరణించాడు. ప్రమాదంలో గాయపడినవారిలో ఇద్దరు ఆసియా దేశాలకు చెందిన వారు కాగా ఒకరు అరబ్ వ్యక్తి. ఇరు వాహనాలు డీ కొన్న సమయంలో చెలరేగిన మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక దళం రంగంలోనికి దిగి మంటలను అదుపు చేశారు. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించారు.    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com