విస్తారా కూడా ఆఫర్ సేల్...
- September 07, 2016
ప్రయాణికులను ఆకట్టుకునేందుకు విమానయాన సంస్థలు ఆఫర్ల బాట పట్టాయి. ఇప్పటికే బడ్జెట్ ఎయిర్‌లైన్ ఎయిర్‌ఏషియా ముందస్తు బుకింగ్‌లపై డిస్కౌంట్ ప్రకటించగా.. తాజాగా విస్తారా కూడా ఆఫర్ సేల్‌తో ముందుకొచ్చింది. అన్ని ఛార్జీలు కలిపి రూ. 949 ప్రారంభ ధరలతో విమాన టికెట్‌లను అందిస్తోంది. సెప్టెంబర్ 10 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ఈ నెల 12 నుంచి 30 మధ్య ప్రయాణించే వారికి ఈ డిస్కౌంట్ ఆఫర్ వర్తిస్తుంది.దీని ప్రకారం.. జమ్ము నుంచి శ్రీనగర్‌కు అన్ని ఛార్జీలు కలిపి టికెట్ ధర రూ. 949గా ఉండనుంది. ఇక గోవా-ముంబయి టికెట్ ధర రూ. 1,099, దిల్లీ-లఖ్‌నవూ ధర రూ.1,399, గువాహటి-బాగ్దోగ్రా ధర రూ. 1,699, దిల్లీ-చండీగఢ్‌కు రూ. 1,799, దిల్లీ-వారణాసి టికెట్ ధరలు రూ. 1,899గా ఉన్నాయి.అయితే ఈ ఆఫర్ కింద ఎన్ని సీట్లు కేటాయించిందన్న విషయాన్ని మాత్రం విస్తారా వెల్లడించలేదు. సాధారణంగా జులై-సెప్టెంబర్ మధ్య విమాన ప్రయాణికుల రద్దీ తక్కువగా ఉంటుంది. దీంతో ప్రత్యేక ఆఫర్లతో ప్రయాణికులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి విమానయాన సంస్థలు.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్‌లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్‌లో భారతీయ పాస్‌పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







