బుల్లితెర పై కనపడనున్న చిరు!
- September 07, 2016
బుల్లితెరపై రెండు సెషన్స్‌లో ఓ రేంజ్లో హంగామా చేసింది నాగార్జున హోస్ట్‌గా వచ్చిన 'మీలో ఎవరు కోటీశ్వరుడు' కార్యక్రమం. రెండు సెషన్స్‌లో అదేజోరు.. టీఆర్పీ రేటింగ్‌లోనూ ఎదురులేకుండా పోయింది. మూడోసారి మాత్రం ఆడియన్స్ నుంచి అనుకున్న స్పందన రాకపోవడంతో ఆ ఛానెల్ కొత్త ప్రయోగం మొదలుపెట్టినట్టు సమాచారం. ఈసారి నాగ్ స్థానంలో హోస్ట్‌గా చిరంజీవిని తీసుకోవాలని భావించడం, ఈ విషయమై చిరుతో మాట్లాడడం ఆయన ఓకే చేసినట్టు ఫిల్మ్‌నగర్‌లో చక్కర్లు కొడుతోంది.
మాటీవీలో డిసెంబర్ 12 నుంచి సోమవారం నుంచి గురువారం రాత్రి ఎనిమిదిన్నర నుంచి తొమ్మిదిన్నర వరకు ప్రసారం కానుందని సమాచారం. ఎట్ ప్రజెంట్ 150వ మూవీతో బిజీగావున్న మెగాస్టార్, చిత్రీకరణ 50శాతం పూర్తి అయ్యిందని, నవంబర్ చివరినాటికి షూటింగ్ ఫినిష్ చేయాలన్నది ఆయన ఆలోచన.ఆ తర్వాత 'మీలో ఎవరు కోటీశ్వరుడు' కార్యక్రమంలో బిజీ కానున్నాడట. ఒకవిధంగా చిరుకి మంచి ఛాన్స్‌గా చాలామంది చెబుతున్నారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అభిమానులకు చిరు దూరమయ్యాడన్న క్యాంపెయిన్ వుంది.. ఈ కార్యక్రమం ద్వారా మళ్లీ దగ్గరకావచ్చునన్నది మెగా ఫ్యాన్స్ భావిస్తోంది.
అది ఖైదీ నెంబర్ 150వ మూవీకి వర్కవుట్ అవుతుందని అంటున్నారు. ఒకప్పుడు 'మీలో ఎవరు కోటీశ్వరుడు' కార్యక్రమానికి గెస్ట్‌గా చిరంజీవి హాజరైన విషయం తెల్సిందే!
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్‌కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్‌పీరియన్స్‌తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







