కలాం, నీకు నా సలామ్‌

- August 03, 2015 , by Maagulf
కలాం, నీకు నా సలామ్‌

అచ్చమైన, అసలు సిసలైన 
సాదా సీదా తనానికి ప్రతిబింబం.
అతి చిన్న కుటుంబంలో జన్మం, 
అతి చిన్న బడిలోనే విద్యాభ్యాసం.
విద్యార్థి దశనుండే విశేషం.
 
శాస్త్రవేత్తగా అద్భుతం,
దేశభక్తునిగా అమోఘం, రాష్ట్రపతిగా గర్వకారణం.
ప్రవక్తలాంటి ప్రసంగం.
విద్యార్థుల పాలిక కల్పవృక్షం, 
యువకులకు స్ఫూర్తిదాయకం, 
వృత్తిపరులకు ఆదర్శనీయం.
రాజకీయుల పాలిట సత్సాంప్రదాయం.
సంస్కార సంస్కృతుల సారాంశం, సౌరభం.
నిత్య అధ్యయనా అవలోకనలకు నిదర్శనం.
నిత్యనూతనానికి ఉదాహరణం, 
నిత్య సత్యానికి సాక్ష్యం.
సచ్చీలతా నిగర్వతలకు నిలువెత్తు అద్దం.
మత సామరస్యానికి అతి మంచి చిహ్నం.
నిరాడంబరతకు నిజ స్వరూపం.
సౌశీల్యతా సౌహృదయతలకు భాష్యం.
స్నేహశీలతా ఉదారతలకు ఆదర్శనీయం.
యువకునిలాంటి ఉత్సాహం, 
యోధునిలాంటి ప్రోత్సాహం.
సుయోధునిలాంటి సామరస్య ప్రయత్నం.
ఎంత ఎదిగినా ఎరిగినవారిని మరవని మనీషత్వం.
తన నేలయెడ, తన వారి యెడ 
సదా కతజ్ఞతా భావం.
దైవభావం కన్నా ఎక్కువ దైవత్వ భావం.
అన్నిటికన్నా ప్రతిభకే గుణానికే ప్రాముఖ్యం.
కలలు కన్న, కనాలన్న కాలాతీతం.
కలాం!
ఈ దేశం ‘ఆమ్‌ ఆద్మీ’ కాంక్షా ఆకాంక్షలకు
నీవు తప్ప మరెవ్వరూ కనబడరు మరో రూపం.
ఇదుగో, అందుకో నా గుండె లోతుల్లో గుబాళించిన
ఈ వినమ్ర పూరిత సలామ్‌!

 

--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com