మనసు లో మాట చెప్పిన ప్రముఖ దర్శకుడు ఎ.కోదండరామరెడ్డి
- August 04, 2015
ఇప్పటి వరకు తాను 93 సినిమాలకు దర్శకత్వం వహించగా వాటిలో 27 మెగాస్టార్ చిరంజీవి న టించినవేనని, తన వం దో సినిమా కూడా ఆయనతోనే చేయాలని ఉందని ప్రముఖ దర్శకుడు ఎ.కోదండరామరెడ్డి అ న్నారు. కార్తీక్ జి.క్రిష్ దర్శకత్వంలో కోదండ రామరెడ్డి తనయుడు వైభవ్ హీరోగా నటించిన 'పాండవుల్లో ఒకడు' సినిమా యూనిట్ సో మవారం అనుశ్రీ సారుుకృష్ణా థియేటర్లో సందడి చేసింది. తం డ్రీ తనయులు మ్యాట్నీషో విరామంలో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కోదండరామరెడ్డి మాట్లాడుతూ చిరంజీవితో ఎన్నో విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించినందుకు ఆనందంగా ఉందన్నారు. 93 సినిమాలు చేసిన తాను మిగతా ఏడూ పూర్తిచేసి, శతచిత్రదర్శకుడిని అనిపించుకుంటానన్నారు. చిరంజీవి అంగీకారం కోసం ప్రయత్నిస్తానన్నారు. వైభవ్‌కు ఎక్కువగా తమిళ సినిమారంగంనుం చి ఆఫర్లు వస్తున్నాయన్నారు. పరిశ్రమలో ప్రతివారూ తమ పిల్లలు స్థి రపడేలా చేయూలనుకుంటున్నప్పుడు తన కొడుకు పైకి రావాలని తా ను ప్రయత్నించడం తప్పు కాదన్నారు. వైభవ్ మాట్లాడుతూ సి నిమాను విజయవంతం చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. త్వరలో మరిన్ని మంచి సినిమాల్లో నటిస్తానన్నారు.
తాజా వార్తలు
- ఎన్ విడియా ఉపాధ్యక్షురాలితో సీఎం చంద్రబాబు భేటీ
- ఏప్రిల్ నుంచి యూపీఐ ద్వారా పీఎఫ్ విత్‌డ్రా
- బీఆర్ఎస్ ఎమ్మెల్యే పై దాడి ఘటనను ఖండించిన కేటీఆర్
- ఖతార్‌లోని ప్రైవేట్ స్కూళ్లలో ఉచిత, రాయితీ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- జెబెల్ షమ్స్లో జీరో కంటే తక్కువకు టెంపరేచర్స్..!!
- బహ్రెయిన్ జస్రాలో అతిపెద్ద విద్యుత్ స్టేషన్ ప్రారంభం..!!
- సౌదీ రియల్ ఎస్టేట్ ధరల సూచీ..క్యూ4లో తగ్గుదల..!!
- కువైట్ లో నాలుగు ప్రైవేట్ ఫార్మసీల లైసెన్స్‌లు రద్దు..!!
- ఫిబ్రవరిలో అహ్మదాబాద్-షార్జా మధ్య స్పైస్‌జెట్ సర్వీసులు..!!
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి







