ప్రీ క్వార్టర్స్‌లో చైనా క్రీడాకారుడు తో తలపడనున్నా పంకజ్
- September 08, 2016
15సార్లు ప్రపంచ స్నూకర్ ఛాంపియన్ అయిన భారత క్రీడాకారుడు పంకజ్ అద్వాణీ సాంగ్సమ్ 6 రెడ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో ప్రీ క్వార్టర్స్‌కి దూసుకెళ్లాడు. గ్రూప్ దశలో వరుసగా డోమినిక్ డేల్(యూకే), రాబర్ట్ మికిన్స్(ఇంగ్లండ్), రైన్ తోమర్సన్(ఆస్ట్రేలియా), పైటూన్ పోన్బన్(థాయ్‌లాండ్) క్రీడాకారులపై విజయం సాధించాడు. ఒకానొక దశలో జర్మనీకి చెందిన క్రీడాకారుడు లూకస్ క్లికర్స్పై 6-0 తేడాతో విజయం సాధించాడు. ఈ టోర్నీలో చైనా క్రీడాకారుల నుంచి పలువురికి గట్టి పోటీ ఎదురవుతోంది. అద్వాణీ ప్రీ క్వార్టర్స్‌లో చైనా క్రీడాకారుడు యూన్ సిజున్తో తలపడనున్నాడు.ఈ సందర్భంగా అద్వాణీ మాట్లాడుతూ.. ప్రీ క్వార్టర్స్‌కు దూసుకెళ్లడం చాలా సంతోషంగా ఉందని, ఇక్కడి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్‌లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్‌లో భారతీయ పాస్‌పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







