నయనతార కొత్త చిత్రం డోరా
- September 08, 2016
వినూత్న కథాంశాలతో రూపొందుతున్న చిత్రాల్లో హీరోల సరసన నటిస్తూనే మరో వైపు కాన్సెప్ట్ ఓరియెంటెడ్ కమర్షియల్ హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటిస్తోంది అగ్రనాయిక నయనతార. ఆమె కథానాయికగా తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ఓ హారర్ చిత్రం తెరకెక్కుతోంది. దాసు రామస్వామి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి డోర అనే టైటిల్‌ను ఖరారు చేశారు. షూటింగ్ తుది దశకు చేరుకుంది. తెలుగులో ఈ చిత్రాన్ని సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా పతాకంపై ప్రముఖ నిర్మాత మల్కాపురం శివకుమార్ తెరకెక్కిస్తున్నారు. తమిళ, తెలుగు భాషల్లో ఈ చిత్రానికి డోర అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సందర్భంగా నిర్మాత మల్కాపురం శివకుమార్ చిత్ర విశేషాలను తెలియజేస్తూ ఇటీవల విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్.. టైటిల్ అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. నయనతార నటిస్తోన్న మరో మహిళా ప్రధాన చిత్రమిది. ఇప్పటి వరకు వచ్చిన హారర్ చిత్రాలకు పూర్తి భిన్నంగా ఓ వైవిధ్యమైన కథాంశంతో రూపొందుతోంది. నయనతార పాత్ర చిత్రణ కొత్త పంథాలో వుంటుంది. ప్రతి సన్నివేశం అనూహ్యమైన మలుపులతో ఉత్కంఠభరింగా సాగుతుంది. మా సంస్థలో నవ్యతతో కూడిన వినూత్న కథా చిత్రాల్ని రూపొందించాలనే ఉద్దేశ్యంతో ఈ చిత్రాన్ని తెలుగులో నిర్మిస్తున్నాను. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం అని తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: దినేష్, సంగీతం: వివేక్, నిర్మాత: మల్కాపురం శివకుమార్.
తాజా వార్తలు
- అమరవీరులకు కువైట్ కన్నీటి నివాళి: సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు
- లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా పై విపక్షాలు అవిశ్వాస తీర్మానం
- యూఏఈలో హెలికాప్టర్ ప్రమాదం: ఇద్దరు సాయుధ దళాల సిబ్బంది మృతి
- గల్ఫ్ దేశాల్లో 12వ తరగతి పరీక్షలు వాయిదా–CBSE కీలక నిర్ణయం
- 23400 ఉల్లంఘనలు..1,200 వాహనాలు సీజ్..!!
- వీడియోలు, ఫోటోలు షేర్.. 313 మంది అరెస్టు..!!
- విదేశాలలో చిక్కుకున్న ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్..!!
- ఆ రెండు కేసుల్లోనే అబార్షన్..షురా కౌన్సిల్ ఆమోదం..!!
- 80 అదనపు విమానాలు..97వేల మందికి లబ్ధి..!!
- ఖతార్ లో లేబర్ మినిస్ట్రీ సేవలు ప్రారంభం..!!









