ఆఫ్గాన్‌ పేలుళ్ళను ఖండించిన బహ్రెయిన్‌

- September 08, 2016 , by Maagulf
ఆఫ్గాన్‌ పేలుళ్ళను ఖండించిన బహ్రెయిన్‌

మనామా: ఆఫ్గనిస్తాన్‌లోని కాబూల్‌లో ఇటీవల సంభవించిన బాంబు పేలుళ్ళను బహ్రెయిన్‌ తీవ్రంగా ఖండించింది. తీవ్రవాదులు బాంబు పేలుళ్ళతో కాబూల్‌పై విరుచుకుపడ్డ ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన నేపథ్యంలో బహ్రెయిన్‌ తీవ్రంగా స్పందించింది. ఆప్ఘనిస్తాన్‌కి తమ నుంచి నైతిక మద్దతు ఎప్పుడూ వుంటుందని ఈ సందర్భంగా బహ్రెయిన్‌, సందేశం పంపింది ఆఫ్ఘనిస్తాన్‌కి. తీవ్రవాద ఘటనల్లో ప్రాణాలు కోల్పోయినవారికి సంతాపం తెలియజేస్తూ, బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది. మినిస్ట్రీ ఆఫ్‌ ఫారిన్‌ ఎఫైర్స్‌, ఈ మేరకు ఓ ప్రకటనలో పేర్కొంది. తీవ్రవాదాన్ని తుదముట్టించేందుకు అంతర్జాతీయ సమాజం అంతా ఒక్కతాటిపైకి రావాలని, అంతర్జాతీయ వేదికలపై తామూ తీవ్రవాదాన్ని ఖండిస్తూనే ఉన్నామని బహ్రెయిన్‌ పేర్కొంది. తీవ్రవాదం మానవాళికి పెను శాపంగా మారిందని బహ్రెయిన్‌ నాయకత్వం అభిప్రాయపడింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com