ఈద్ సందర్భంగా 10 రోజులపాటు ఉచిత వైఫై
- September 08, 2016
ఈద్ అల్ అదా సందర్భంగా యూఏఈ అంతటా పది రోజులపాటు ఉచిత వైఫైని అందిస్తున్నట్లు ఎటిసలాట్ ఓ ప్రకటనలో పేర్కొంది. పబ్లిక్ వైఫైని మాల్స్‌లోనూ, రెస్టారెంట్స్‌లోనూ, కేఫ్‌లు తదితర ప్రాంతాల్లో ఉచిత వైఫై సౌకర్యాన్ని ఎటిసలాట్ సంస్థ అందించనుంది. సెప్టెంబర్ 8 నుంచి 17 వరకు ఈ ఉచిత వైఫై సేవలు అందుబాటులో ఉంటాయి. దేశంలోని 300 పబ్లిక్ లొకేషన్లలో అత్యంత వేగంతో మొబైల్ ఫోన్లకు వైఫై సౌకర్యాన్ని అందిస్తారు. ఎటిసలాట్ చీఫ్ కస్టమర్ ఆఫర్ కాలెద్ ఎక్కౌలీ మాట్లాడుతూ, ఫెస్టివ్ స్పిరిట్‌తో వినియోగదారులతో కలిసి ఈద్ అలా సంబరాల్లో ఆము కూడా భాగం పంచుకుంటున్నందుకు ఆనందంగా ఉందని చెప్పారు. వన్ టైమ్ రిజిస్ట్రేషన్ ద్వారా వినియోగదారులకు పిన్ నెంబర్‌ని ఎస్‌ఎంఎస్ చేస్తారు. మొబైల్ నెంబర్‌ని లాగిన్ ఐడీగానూ, పిన్ నెంబర్‌ని పాస్‌వర్డ్‌గానూ వినియోగించుకుని ఉచిత వైఫైని యాక్సెస్ చేయవచ్చు.
తాజా వార్తలు
- గ్లోబల్ సమిట్ 2025 ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభిం చారు
- తిరుపతి విద్యార్థిని పై దాడి: హోంమంత్రి కఠిన స్పందన
- గూగుల్ స్ట్రీట్, మైక్రోసాఫ్ట్ రోడ్ ప్రతిపాదనపై సీఎం రేవంత్
- బహ్రెయిన్, యూఏఈ పై ఇరాన్ కామెంట్స్..జీసీసీ సీరియస్..!!
- ఖతార్ లో నేషనల్ వాలంటీర్ వర్క్ ల్యాబ్ ప్రారంభం..!!
- 36, 610 మంది ప్రవాసులను బహిష్కరించిన కువైట్..!!
- సౌదీలో ఇల్లీగల్ రైడ్..వారంలో 1,278 మంది అరెస్టు..!!
- వింటర్ ట్రావెల్ ఇల్నెస్..డాక్టర్స్ వార్న్..!!
- మస్కట్ లో సునామీ పై మూడు రోజుల క్యాంపెయిన్..!!
- హైదరాబాద్ లో ప్రారంభమైన గ్లోబల్ సమ్మిట్ సమావేశం







