దుబాయ్ ఎయిర్‌పోర్టుల్లో ఈద్ రద్దీ
- September 09, 2016
దుబాయ్: ఈద్ హాలిడే సందర్భంగా దుబాయ్ విమానాశ్రయాల్లో ట్రాఫిక్ రద్దీ విపరీతంగా ఉండనుంది. సుమారు 1 మిలియన్ ప్రయాణీకులు దుబాయ్ ఎయిర్‌పోర్టుల ద్వారా విదేశాలకు ప్రయాణించే అవకాశం ఈ సీజన్లో ఉందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో వివిధ ఎయిర్‌లైన్ సంస్థలు, అలాగే ఎయిర్పోర్ట్ వర్గాలూ ప్రయాణీకులకు రద్దీపై ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు అందిస్తున్నాయి. ఇంకో వైపున దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పలు రకాల సాంస్కృతిక కార్యక్రమాల్ని ఏర్పాటు చేస్తున్నారు. ఆఫ్రికన్ డ్రమ్మర్స్, జగ్లర్స్ మరియు డబ్కా డాన్సర్స్, వర్చ్యువల్ రియాలిటీ గేమింగ్ వంటివి ఇక్కడ ప్రయాణీకుల్ని అలరించనున్నాయి. ముందస్తుగా టెర్మినల్ని ఎంపిక చేసుకోవడం, సరైన సమయానికి కాస్త ముందుగా విమానాశ్రయానికి చేరుకోవడం, ఎయిర్‌లైన్స్‌తో పూర్తి సమాచారాన్ని ముందుగానే తెలుసుకోవడం, ప్యాకేజీల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లేకుండా చూసుకోవడం ముఖ్యమైన సూచనలు. ఇ-గేట్ కార్డ్‌ని వినియోగించడం ద్వారా పాస్‌పోర్ట్ కంట్రోల్ వద్ద 'క్యూ'ని తప్పించుకోవచ్చు.
తాజా వార్తలు
- తెలంగాణలో ₹1,000 కోట్ల స్టార్టప్ ఫండ్ ప్రకటించిన సీఎం రేవంత్
- తిరుమలలో మరో స్కామ్: నకిలీ పట్టు దుపట్టా మోసం
- మాలికి ట్రావెల్ బ్యాన్..వెంటనే తిరిగిరండి..!!
- ఒమన్ లో అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం..!!
- దర్బ్ అల్ సయ్ లో నేషనల్ డే కార్యకలాపాలు..!!
- సౌదీ అరేబియాలో సీజనల్ రెయిన్ ఫాల్..!!
- మనమా సౌక్.. మనమా ఆత్మ, హార్ట్ బీట్..!!
- కువైట్ చేరిన ఇండియన్ కోస్ట్ గార్డు షిప్ సర్థాక్..!!
- ఎన్నికల తేదీల కోసం జనాల ఎదురు చూపులు: కేటీఆర్
- దేశ ప్రజలకు ప్రధాని మోదీ కీలక విజ్ఞప్తి..!







