ఏపీ బంద్

- September 09, 2016 , by Maagulf
ఏపీ బంద్

 ఆంధ్రప్రదేశ్ లో విపక్షాలు బంద్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వనందుకు నిరసనగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో విపక్షాలు బంద్ పాటిస్తున్నాయి. హోదా అడిగితే ఏపీకి స్పెషల్ ప్యాకేజీ ఇచ్చి చేతులు దులుపుకోవడంపై వైసీపీ, లెఫ్ట్ పార్టీలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయి. ఇవాళ రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చాయి. ఏపీకి కేంద్రం కొత్తగా చేస్తున్న మేలేమీ లేదన్నాయి. పోలవరం గురించి చట్టంలో కూడా ఉందని.. ఇప్పటికైనా చంద్రబాబు కళ్లు తెరిచి కేంద్రాన్ని నిలదీయాలని సూచించారు. ఏపీ బంద్ ఉదయం ఐదు గంటల నుంచే మొదలైంది. ఉదయాన్నే రోడ్డెక్కిన ఆందోళనకారులు రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోల వద్ద బస్సుల్ని అడ్డుకుంటున్నారు.భావోద్వేగంతో కూడుకున్నది కావడంతో అన్నివర్గాల ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. ఆర్టీసీ డిపోల ఎదుట బైఠాయించిన వైసీపీ, లెఫ్ట్ శ్రేణులు బస్సులు బయటకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. విజయవాడ, విశాఖ, తిరుపతి, కడప, కర్నూలు, అనంతపురం ఇలా ఎక్కడ చూసినా బంద్ ప్రభావం కనిపిస్తోంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com