పతంజలి ఫుడ్ పార్క్‌కు శంకుస్థాపన చేసిన కేంద్ర మంత్రి
- September 10, 2016
ప్రముఖ యోగా గురువు రామ్ దేవ్‌బాబా ఆధ్వర్యంలో నాగపూర్‌లో నెలకొల్పుతున్న పతంజలి మెగా ఫుడ్ అండ్ హెర్బల్ పార్కుకు శనివారం శంకుస్థాపన చేశారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్, కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది. శంకుస్థాపన కార్యక్రమంలో రామ్‌దేవ్ బాబా మాట్లాడుతూ దాదాపు 230 ఎకరాల్లో నిర్మించనున్న ఈ పతంజలి ఫుడ్ పార్క్ ద్వారా 10వేల మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించినట్లు అవుతుందని వెల్లడించారు. రకరకాల వ్యవసాయ ఉత్పత్తుల కోసం పతంజలి గ్రూప్ వ్యవసాయదారులకు రుణసౌకర్యం కల్పిస్తుందన్నారు.
పతంజలి ఫుడ్ పార్క్ కోసం వేరే రాష్ట్రాలు ఉచితంగా స్థలాలను ఇస్తామన్నా, నాగ్‌పూర్‌లోనే దీన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఫడణవీస్ వెల్లడించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఫుడ్ పార్క్ ఇదేనన్నారు. ఇందుకోసం పతంజలి సంస్థ ఎకరాకి రూ.25లక్షలు చెల్లించి స్థలాన్ని కొనుగోలు చేసిందని తెలిపారు.
తాజా వార్తలు
- భారత్‌లో 2.5 లక్షల టాటా ఎలక్ట్రిక్ కార్లు
- ఫ్లెమింగో రెస్టారెంట్ తాత్కాలికంగా మూసివేత..!!
- సౌదీలో తగ్గిన బ్యాంకింగ్, పేమెంట్ సేవా రుసుములు..!!
- యూఎస్ కాన్సులేట్ 3 రోజులపాటు మూసివేత..!!
- లైసెన్స్ లేకుండా అడ్వర్టైజ్.. KD 500 జరిమానా..!!
- బహ్రెయిన్‌లో TRA శాటిలైట్ డైరెక్ట్-టు-డివైస్ సేవలు..!!
- ఒమాన్-సౌదీ ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం..!!
- మిషన్ భద్రత పై భారత రాయబారికి బంగ్లాదేశ్ సమన్లు
- దుబాయ్‌లో ఘనంగా ప్రవాస తెలుగువారి క్రూజ్ క్రిస్మస్ వేడుకలు
- 'National Army Day' కి ఐక్యతతో నివాళులు







