వివాదంలో చిక్కుకున్న 'మెంటల్' సినిమా
- September 10, 2016
ఈ శుక్రవారం విడుదలైన శ్రీకాంత్ మూవీ మెంటల్ పై మరో వివాదం మొదలైంది, గతంలో టైటిల్ విషయంలో పోలీస్ డిపార్ట్ మెంట్ వారు అభ్యంతరం తెలపటంతో మెంటల్ పోలీస్ గా ఉన్న పేరును మెంటల్ గా మార్చారు. తాజాగా ఈ సినిమాకు దర్శకుడిగా, నా పేరు వేయకుండా వేరే వారి పేరు వేశారంటూ కరణం పి బాబ్జీ అనే వ్యక్తి గొడవకు దిగాడు.
ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమా వివిధ కారణాల మూలంగా వాయిదా పడుతూ వచ్చింది. ఫస్ట్ లుక్ టీజర్ లు రిలీజ్ అయిన సమయంలో చిత్ర దర్శకుడిగా కరణం పి బాబ్జీ పేరు కనిపించినా.. విడుదలకు దగ్గరయిన తరువాత మాత్రం ఎస్ కె బషీద్ ను దర్శకుడిగా పరిచయం చేశారు. టైటిల్స్ లోనూ బషీద్ పేరుతోనే సినిమా రిలీజ్ అయ్యింది.
ఈ విషయంపై స్పందించిన కరణం బాబ్జీ, మెంటల్ సినిమాకు తానే దర్శకుడినని, తన పేరు తీసేసి బషీద్ పేరు వేశారని ఆరోపించారు. ఈ సినిమాకు 5.17 లక్షల పెట్టుబడి కూడా పెట్టానని, దాదాపు ఏడాదిన్నర పాటు సినిమా కోసం పనిచేశానని తెలిపాడు. టైటిల్ విషయంలో హీరో శ్రీకాంత్ కు ఫోన్ చేస్తే అరగంటలో మార్పిస్తానని చెప్పి ఇంత వరకు మార్పించలేదని ఆరోపించారు.
రేపటిలోగా పేరు మార్చకపోతే ఛాంబర్ ముందు దీక్ష చేస్తానని, అప్పటికీ స్పందించకపోతే బషీద్ ఇంటి ముందు ఆత్మహత్య చేసుకుంటాన్నారు. ఈ విషయంపై స్పందించిన నిర్మాత మండలి పేరు మార్చే అధికారం నిర్మాతకు మాత్రమే ఉంటుందని, నిర్మాత ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో ఘనంగా శతావధాన కార్యక్రమం
- విద్యార్థుల కోసం పార్ట్నర్ షిప్ సమ్మిట్: సీఎం చంద్రబాబు
- భారత్‌లో 2.5 లక్షల టాటా ఎలక్ట్రిక్ కార్లు
- ఫ్లెమింగో రెస్టారెంట్ తాత్కాలికంగా మూసివేత..!!
- సౌదీలో తగ్గిన బ్యాంకింగ్, పేమెంట్ సేవా రుసుములు..!!
- యూఎస్ కాన్సులేట్ 3 రోజులపాటు మూసివేత..!!
- లైసెన్స్ లేకుండా అడ్వర్టైజ్.. KD 500 జరిమానా..!!
- బహ్రెయిన్‌లో TRA శాటిలైట్ డైరెక్ట్-టు-డివైస్ సేవలు..!!
- ఒమాన్-సౌదీ ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం..!!
- మిషన్ భద్రత పై భారత రాయబారికి బంగ్లాదేశ్ సమన్లు







