మరో హర్రర్ సినిమాలో త్రిష
- September 11, 2016
ఒకప్పుడు లవ్, ఫ్యామిలీ చిత్రాలలో నటించేందుకు ఆసక్తి చూపించిన త్రిష ప్రస్తుతం హర్రర్ సినిమాలపైనే పూర్తి దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది. మొన్నటికి మొన్న నాయకి సినిమాతో భయపెట్టిన త్రిష తాజాగా మోహిని అనే లేడి ఓరియెంటెడ్ మూవీతో అభిమానుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. త్రిష ద్విపాత్రాభినయం చేసిన నాయకి చిత్రం తెలుగులో ఇటీవల తెరపైకి రాగా ఆశించిన ఫలితాన్ని రాబట్టలేకపోయింది. త్వరలో ఈ చిత్రం తమిళంలో కూడా విడుదలకు సిద్ధం అవుతోంది. ఇక తాజాగా మరో హారర్ చిత్రానికి త్రిష గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. హాలీవుడ్ చిత్రానికి రీమేక్ గా ఆ సినిమా ఉండనున్నట్టు సమాచారం. ఇందులోనూ ఈ బ్యూటీ ద్విపాత్రాభినయం చేయనున్నారట.మరి ఈ చిత్రానికి సంబంధించిన మిగతా విషయాలు త్వరలోనే వెల్లడించనున్నట్టు సమాచారం.
తాజా వార్తలు
- ఫ్లైనాస్ విమానానికి బాంబు బెదిరింపు..శంషాబాద్లో అత్యవసర ల్యాండింగ్
- కాలిఫోర్నియాలో ఇండియన్ సర్వీస్ సెంటర్ ఫ్రారంభం
- నిషేధిత లేదా నకిలీ పెస్టిసైడ్స్ తయారీ, దిగుమతి పై భారీ జరిమానా
- శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా
- అంతర్జాతీయ సైబర్ నెట్వర్క్ గుట్టురట్టు చేసిన సీఐడీ
- అర్జున అవార్డు రేసులో తెలంగాణ క్రీడాకారులు
- శంకర నేత్రాలయ లాస్ ఏంజెలెస్ చాప్టర్ కార్యక్రమం ఘన విజయం
- మౌలానా అబుల్ కలాం అజాద్ అవార్డు గ్రహీత సయ్యద్ నాజర్కు ఘన అభినందన సభ
- మస్కట్లో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన...
- కర్ణాటకలో ఘోర బస్సు ప్రమాదం..







