వంగవీటి సినిమాలో వర్మ పాడిన సాంగ్...

- September 11, 2016 , by Maagulf
వంగవీటి సినిమాలో వర్మ పాడిన  సాంగ్...

టాలీవుడ్ లో సంచలనాలకు మరో పేరు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. ఆయన సినిమాల్లో కంటే... పబ్లిసిటీలోనే ఈమధ్య ఎక్కువ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాడు. ఏదోక సినిమా ప్రకటించడం, షూటింగ్ కు ముందే దానికి మంచి హైప్ తేవడం వర్మకు అలవాటు. వంగవీటి చిత్రంతో మరో సంచలనానికి తెరతీసినట్టు చెబుతున్న వర్మ విజయవాడలో రౌడీయిజం ఎలా ఉండేదీ అనేది తన సినిమాలో చూపించవచ్చని అనుకుంటున్నారు..ఈ సినిమా తీస్తానని వర్మ ప్రకటించినప్పటి నుంచి ఆ మూవీపై ఎన్నో విమర్శలు వచ్చాయి. వివాదాలు నెలకొన్నాయి. కోర్టుల్లో కేసులు కూడా వేశారు.అయితే ఈ చిత్రానికి సంబంధించి వర్మ ఓ పాట పాడి అందరిని ఆశ్చర్య పరిచాడు. అంతే కాదు తన పాడిన పాటని పవన్ ఇటీవల జరిగిన సభలో పాడిన పాటకు కంపార్ చేస్తూ ఎవరు బాగా పాడారు అంటూ అందరూ హీరోల అభిమానులకు వోటింగ్ పెట్టాడు.ఏదేమైన వర్మ తన సినిమాకు చేస్తున్న ప్రమోషన్ స్ట్రాటజీని చూసి కొందరు అవాక్కవుతున్నారు. వర్మ ఈ చిత్రాన్ని అక్టోబర్ 2న విడుదల చేస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com