హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం..

- September 11, 2016 , by Maagulf
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం..

 ఉపరితల ఆవర్తనం ప్రభావంతో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. హయత్‌నగర్‌, వనస్థలిపురం, ఎల్బీనగర్‌, నాగోల్‌, ఉప్పల్‌, తార్నాక, నాచారం, మల్లాపూర్‌, హబ్సిగూడ, లాలాపేట్‌ తదితర ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తోంది. పలుచోట్ల రహదారులపై వర్షపు ప్రవహిస్తుండటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఉపరితల ఆవర్తనం 24 గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశముందని.. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తామని వాతావరణ శాఖ ప్రకటించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com